పటాస్ ప్రవీణ్ కూడా టీం లీడర్ అయ్యాడోచ్..!
TeluguStop.com
తెలుగు బుల్లితెర మీద సూపర్ హిట్ కామెడీ షో అంటే అందరు చెప్పే పేరు ఒక్కటే అదే జబర్దస్త్( Jabardasth ) అనసూయ, రష్మి యాంకర్లుగా వస్తున్న జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ లకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.
అనసూయ ఆ షో నుంచి ఎగ్జిట్ అయ్యాక కొత్త యాంకర్ సౌమ్యా రావు రంగంలోకి దిగింది.
ఆమె కూడా తన మార్క్ యాంకరింగ్ తో అలరిస్తుంది.ఇక జబర్దస్త్ కమెడియన్లు కూడా సినిమా ఛాన్స్ లు అందుకుంటూ బిజీ అవుతున్నారు.
ఈ క్రమంలో జబర్దస్త్ కి వారు డేట్స్ ఇచ్చే టైం దొరకట్లేదు.అందుకే ఉన్న వారిలో బెస్ట్ కామెడీ చేసే వారిని ఎంకరేజ్ చేస్తున్నారు.
"""/" /
ఈమధ్యనే ఇమ్మాన్యుయెల్ ని కొత్త టీం లీడర్ గా ప్రమోట్ చేశారు.
ఇస్మార్ట్ ఇమ్మాన్యుయెల్ గా అతన్ని కొత్త టీం ఏర్పడింది.ఇక లేటెస్ట్ గా పటాస్ ప్రవీణ్ ని( Patas Praveen ) కూడా టీం లీడర్ గా ప్రమోట్ చేశారు.
పటాస్ షోతో పాపులర్ అయిన ప్రవీణ్ ఆ క్రేజ్ తో జబర్దస్త్ లోకి వచ్చాడు.
ప్రవీణ్ ఈమధ్య రాకేష్ టీం లో వరుస స్కిట్స్ హిట్ కొడుతూ వచ్చాడు.
ఫైనల్ గా ఎక్స్ ట్రా జబర్దస్త్ లో టీం లీడర్ గా ప్రమోట్ అయ్యాడు.
అంతేకాదు షకలక శంకర్( Shakalaka Shankar ) కూడా మళ్లీ జబర్దస్త్ లోకి వచ్చాడు.
కొత్త టీం లీడర్స్ తో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కళకళలాడుతుంది.
బాలయ్య కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడా..?