Patas Praveen Indraja: ఆ పని చేసి ఇంద్రజ తల దించుకునేలా చేసిన పటాస్ ప్రవీణ్.. ఏం జరిగిందంటే?
TeluguStop.com
తెలుగులో ఇటీవలే మొదలైన కామెడీ షో శ్రీదేవి డ్రామా కంపెనీ.( Sridevi Drama Company ) అతి తక్కువ సమయంలోనే అత్యంత ప్రేక్షకధారణను పొంది ప్రేక్షకులను ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది.
ప్రతి వారం ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకువచ్చి, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు.కేవలం కమెడియన్లు మాత్రమే కాకుండా సింగర్లు డాన్సర్లు అలాగే కొంతమంది సీరియల్ ఆర్టిస్టులు వెండితెర సెలబ్రిటీలు కూడా ఇందులో పాల్గొని ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే శ్రీదేవి డ్రామా కంపెనీలో తనదైన శైలిలో కామెడీ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ లలో ప్రవీణ్ కూడా ఒకరు.
ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ప్రవీణ్( Praveen ) చేసిన పనికి ఇంద్రజ హర్ట్ అవడంతో పాటు ప్రవీణ్ వైపు కోపంగా కూడా చూసింది.
అంతే కాకుండా ప్రవీణ్ చేసిన పనికి ఎమోషనల్ అయ్యింది.ఇంతకీ ప్రవీణ్ ఏం చేశాడు అసలు ఏం జరిగింది అన్న వివరాల్లోకి వెళితే.
తాజాగా ప్రవీణ్ ఒక అమ్మాయిని శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజి మీదకు తీసుకొచ్చాడు.
ఆమె పేరు మమతా( Mamata ) అని ఇంట్రడ్యూస్ కూడా చేసాడు.ఓకే ఈవెంట్ కి రాజమండ్రి వెళ్ళినప్పుడు పరిచయం అయ్యింది అని చెప్పాడు.
ఇక రష్మీ, ఇంద్రజ చాల హ్యాపీగా ఫీల్ అయ్యారు. """/" /
ఇక ఇంద్రజ( Indraja ) కూడా ప్రవీణ్ కి విషెస్ చెప్పారు.
కార్ కొన్నది మమతా కోసమేనా అంటూ ఆట పట్టించారు.అప్పుడు ప్రవీణ్ తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు.
ఇప్పటి వరకు ఆ అమ్మాయికి ప్రపోజ్ ఎందుకు చేయలేదు అంటూ రష్మీ( Rashmi ) కూడా ఫైర్ అయ్యింది.
ఇంత అందమైన అమ్మాయికి కూడా నువ్వు లవ్ ప్రపోజ్ చేయలేదంటే వేస్ట్ అంటూ కూడా కామెంట్స్ చేసింది.
అయితే ఇంద్రజ మాత్రం ప్రవీణ్ కి ఒక సలహా ఇచ్చారు. """/" /
పేరెంట్స్ కి చెప్పి వాళ్ళ పర్మిషన్ తో పెళ్లి చేసుకో అంటూ మమతాకి ప్రవీణ్ కి చెప్పారు.
ఇంత చెప్పిన తర్వాత ఇంద్రజ హ్యాపీమూడ్ లో ఉండగా అమ్మా ఇదంతా ప్రాంక్( Prank ) అసలు ఈ పెళ్లి విషయం చెప్తే మీరు ఎలా ఫీలవుతారో అంటూ సరదాగా ఈ కాన్సెప్ట్ మీద చేసాం అని ప్రవీణ్ ఫైనల్ గా షాకిచ్చేసరికి ఇంద్రజ చాల ఫీలైపోయి తలదించేసుకుంది.
ఈ విషయంలో నేను చాలా బాధపడ్డాను అయినా నీకు పెళ్లి అంటే ఆటలుగా ఉందా అంటూ ప్రవీణ్ వైపు కోపంగా చూసింది ఇంద్రజ.
పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ రాధికా ఆప్టే.. ఫోటోలు షేర్ చేస్తూ?