Faima, Praveen : ఫైమాకు నేను నచ్చలేదు.. బ్రేకప్ కు కారణమిదా.. ఆ షోలో పటాస్ ప్రవీణ్ ఏమన్నారంటే?

తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర జంట ఫైమా, ప్రవీణ్( Faima, Praveen ) ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

వీరిద్దరూ పటాస్ షో( Patas Show ) ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు.

ఆ తర్వాత జబర్దస్త్ షోకి ఎంట్రీ ఇచ్చి విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నారు ప్రవీణ్ పైమా.

కాగా ప్రవీణ్ సంగతి పక్కన పెడితే ఫైమా మాత్రం తనదైన శైలిలో కామెడీ చేసి అతి తక్కువ సమయంలోనే లేడీ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకోవడం తో పాటు భారీగా అభిమానులను సంపాదించుకుంది.

ఇకపోతే ఫైమా ప్రవీణ్ మధ్య ప్రేమ ఉందని వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని గతంలో ఎన్నో రకాల వార్తలు వినిపించాయి.

"""/" / ఇక యూట్యూబ్ ఛానల్( YouTube Channel ) లో కూడా ఒకరికొకరు చాలా సందర్భాల్లో గిఫ్ట్ లు ఇచ్చుకోవడం సర్ప్రైజ్లు చేసుకోవడం లాంటివి చేయడంతో వీరిద్దరి మధ్య నిజంగానే ప్రేమ ఉందని చాలామంది అభిప్రాయపడ్డారు.

తెలుగు బుల్లితెరపై ఉన్న ప్రేమ జంటల్లో ఫైమా ప్రవీణ్ కూడా ఒకరు.సుడిగాలి సుధీర్ యాంకర్ రష్మి తర్వాత చాలామంది గుర్తింపు తెచ్చుకోగా వారిలో ఫైమా ప్రవీణ్ కూడా ఒకరు.

ఫైమా, ప్రవీణ్‌లు ప్రేమించుకున్న విషయాన్ని బహిరంగంగానే చెప్పారు.కానీ ఈ మధ్య ఈ ఇద్దరు మధ్య గ్యాప్‌ వచ్చింది.

విడిపోయినట్టు ప్రచారం జరిగింది.ఆ మధ్య ప్రవీణ్‌ వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇద్దరు కలిశారు.శ్రీదేవి డ్రామా కంపెనీ ( Sridevi Drama Company )షోలో సందడి చేశారు.

ఇటీవల ఫైమా స్టార్‌ మా షోస్‌ చేసింది. """/" / ఈటీవీకి దూరమయ్యింది.

బిగ్‌ బాస్‌ షోలోకి వెళ్లాక ఆమె జబర్దస్త్ ఛాన్స్ ని కోల్పోయింది.దీంతో స్టార్‌ మాతో పాటు ఇతర షోస్‌లో సందడి చేస్తుంది.

ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ఈ ఇద్దరు కలిశారు.రష్మి యాంకర్‌గా ఉన్న ఈ షోలో ఈ ఇద్దరి వ్యవహారాన్ని తేల్చేయాలని నిర్ణయించుకున్నారు.

హైపర్‌ ఆది, రష్మి, ఇంద్రజలు కలిసి వీరిని నిలదీశారు.ఏం జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు.

దీనిపై ఎట్టకేలకు ప్రవీణ్‌ ఓపెన్‌ అయ్యాడు.అసలు విషయం చెప్పే ప్రయత్నం చేశాడు.

తాను ఫైమాకి నచ్చలేదని తెలిపారు.ఆమెనే తనతో నువ్వు నచ్చలేదని చెప్పినట్టు వెల్లడించాడు.

అయితే ఇద్దరిని కలిసి పట్టుకోవాలని చెప్పగా, ఫైమా కాస్త ఇబ్బంది పడుతూ కనిపించింది.

ఆయనతో మాట్లాడేందుకు కూడా ఇబ్బంది పడుతున్నట్టు కనిపించింది.అంతేకాదు ఇద్దరం మాట్లాడుకుంటున్నామని బలవంతంగా చెప్పింది.

ఇది గమనించిన యాంకర్‌ రష్మి.అసలు విషయాన్ని చెప్పింది.

బాగానే ఉంటున్నావని చెబుతున్నావ్‌, కానీ అతన్ని పట్టుకునేందుకే ఇబ్బంది పడుతున్నావని ప్రశ్నించగా, ఫైమా సమాధానం చెప్పలేకపోయింది.

ఇద్దరూ ఇబ్బంది పడుతున్నారు.ఇద్దరి మధ్య ఏదో బలమైన కారణం కనిపిస్తుంది.

కానీ అదేంటో చెప్పలేకపోతున్నారు.క్లోజ్‌ కాలేకపోతున్నారు.

మరి అదేంటో తెలియాల్సి ఉంది.

ఆ స్టార్ హీరోయిన్ కు రామ్ చరణ్ తెలుగు నేర్పించాడా.. ఏం జరిగిందంటే?