హాట్ యాంకర్ కి ఛాలెంజ్ విసిరిన పటాస్ శ్రీముఖి...

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఏ ముహూర్తంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమాన్ని మొదలు పెట్టారో  తెలియదు గానీ ఈ ఉద్యమం రోజురోజుకి ఊపందుకుంటోంది.

ముఖ్యంగా ఈ ఉద్యమానికి సినీ సెలబ్రిటీల నుంచి మాత్రం మంచి స్పందన వస్తోంది.

  అంతేగాక వారు తమకు ఇష్టమైన వాళ్లను కూడా ఇందులో భాగస్వాములను చేస్తున్నారు.అయితే తాజాగా ప్రముఖ తెలంగాణ ఫోక్ సింగర్ మంగ్లీ గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమంలో పాల్గొని మొక్కలు నాటారు.

ఇందులో భాగంగా మొక్కలు నాటాలని ప్రముఖ యాంకర్ శ్రీముఖికి ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే.

అయితే ఈ చాలెంజ్ యాంకర్ శ్రీముఖి ప్రతిష్టాత్మకంగా తీసుకొని జూబ్లీహిల్స్ ప్రాంతంలో మొక్కలు నాటింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు మానవ జీవితంలో ఎంతగా ఉపయోగపడతాయో మరియు వాటి ప్రాముఖ్యతను వివరించింది.

అంతేగాక ప్రస్తుతం నగరంలో పెరిగిపోతున్న టువంటి కాలుష్యానికి భయపడి తమ స్నేహితుల పిల్లలు ఇతర దేశాల్లో స్థిరపడాలని అనుకుంటున్నట్లు మరియు భవిష్యత్తులో మనం కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు పిలుపునిచ్చారు.

"""/"/అయితే ఇది ఇలా ఉండగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని జబర్దస్త్ ఫేమ్ యాంకర్ రష్మి గౌతమ్, బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పాటిస్పేట్ చేసినటువంటి వితిక మరియు ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ అయినటువంటి జానీ మాస్టర్ లకు ఈ చాలెంజ్ విసిరింది.

అయితే ఇప్పటికే జార్జి రెడ్డి హీరో సందీప్ మాధవ్ మరియు అక్కినేని అమల వంటి సెలబ్రిటీలు ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమంలో పాల్గొని మొక్కలు నాటి తమకి ఇష్టమైన వాళ్ళకి ఈ ఛాలెంజ్ విసిరి వాళ్ళను ఈ ఉద్యమంలో భాగస్వామ్యులను చేస్తున్నారు.

వైశాలికి షేక్‌హ్యాండ్ ఇవ్వని ఉజ్బెక్ చెస్ ప్లేయర్.. ఇస్లాం కారణమంటూ కొత్త ట్విస్ట్..?