Neelam Madhu : మళ్లీ కాంగ్రెస్ గూటికి పటాన్ చెరు నేత నీలం మధు..!
TeluguStop.com
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరుకు చెందిన నీలం మధు( Neelam Madhu ) బీఎస్పీకి రాజీనామా చేశారు.
ఈ మేరకు ఈ నెల 15వ తేదీన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది.
హైదరాబాద్ లోని గాంధీభవన్ లో దీపాదాస్ మున్షి సమక్షంలో నీలం మధు కాంగ్రెస్( Congress ) కండువా కప్పుకోనున్నారు.
"""/"/అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నీలం మధుకు టికెట్ ఇచ్చి చివరి నిమిషంలో కాంగ్రెస్ వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నీలం మధు బీఎస్పీలో చేరారు.బీఎస్పీ( BSP ) తరపున అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన నీలం మధు 46 వేల ఓట్లు సాధించారు.
అయితే తాజాగా బీఎస్పీకి రాజీనామా చేసిన ఆయన మరోసారి కాంగ్రెస్ గూటికి చేరనున్నారని సమాచారం.
తేనెతో నిద్రలేమి ఇక దూరం..!