ఎస్పీని కలిసిన పాస్పోర్ట్ అమెరికన్ కౌన్సిల్ ఏజెంట్స్

సూర్యాపేట జిల్లా:పాస్పోర్ట్ వెరిఫికేషన్,పాస్పోర్ట్ జారీలకు సంబంధించిన తెలంగాణ రీజినల్ పాస్పోర్ట్ అమెరికన్ కౌన్సిల్ సిబ్బంది మంగళవారం జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ను కలిశారు.

పాస్పోర్ట్ జారీలో స్పెషల్ బ్రాంచ్ జిల్లాలో సిబ్బంది పని తీరు,ఫారెన్ సర్వీసెస్ కు సంబంధించి చర్చించారు.

జిల్లాలో పాస్పోర్ట్ వెరిఫికేషన్ కు సంబంధించి కచ్చితమైన ప్రణాళిక అమలు చేస్తున్నామని,అర్జీదారులకు సత్వర సేవలు అందిస్తున్నామని,సాంకేతిక పద్దతిలో ముందుకు వెళుతున్నామని ఎస్పీ కౌన్సిల్ సిబ్బందికి వివరించారు.

ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభాస్ సలార్ 2 సినిమా సెట్స్ మీదకి వచ్చే అవకాశం ఉందా..?