పార్వతీపురం మన్యం జిల్లాలో ఒంటరి ఏనుగు హల్చల్
TeluguStop.com
పార్వతీపురం మన్యం జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది.కొమరాడ మండలం అర్థం గేట్ సమీపంలో గజరాజు హల్ చల్ చేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
జాతీయ రహదారిపైకి వచ్చిన ఒంటరి ఏనుగు అటుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై దాడి చేసింది.
ఈ ఘటనలో బస్సు అద్దాలు ధ్వంసం కాగా భయాందోళనకు గురైన ప్రయాణికులు పరుగులు తీశారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.ఈ క్రమంలోనే ఏనుగును దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
వైరల్ వీడియో: ఇదేందయ్యా ఇది.. వెండితో మెరిసిపోతున్న బెడ్ రూమ్