రామాయణం స్పూర్తితో దేవర.. వైరల్ అవుతున్న పరుచూరి గోపాలకృష్ణ కామెంట్స్!
TeluguStop.com
దేవర మూవీ విడుదలకు సమయం దగ్గర పడుతోంది.దేవర( Devara ) సినిమా విడుదలకు మరో 9 రోజుల సమయం మాత్రమే ఉంది.
దేవర ట్రైలర్ విడుదలై వారం రోజులైనా ట్రైలర్ లో కథ గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇవ్వలేదు.
దేవర ట్రైలర్(Devara Trailer) గురించి పరుచూరి గోపాలకృష్ణ(Paruchuri Gopalakrishna) మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దేవర టీమ్ కు శుభాకాంక్షలు చెబుతూ పరుచూరి వీడియోను రిలీజ్ చేశారు.రావణుడి కోసం రాముడు సముద్రాన్ని దాటిన ఘట్టాన్ని స్పూర్తిగా తీసుకుని దేవరలో కొన్ని సీన్స్ తీశారేమో అని అనిపిస్తోందని పరుచూరి తెలిపారు.
రాముడు సముద్రాన్ని దాటిన విధంగా దేవరలో జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR)సైతం పడవపై నిల్చొని సముద్రాన్ని దాటుతున్నట్టు చూపించారని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్రలో గమ్మత్తులు ఉన్నట్టు తెలుస్తోందని పరుచూరి పేర్కొన్నారు.
"""/" /
హీరోయిన్ డైలాగ్స్ చూస్తే కొరటాల శివ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేస్తున్నట్టు అర్థమవుతుందని పరుచూరి వెల్లడించారు.
సినిమాలో సముద్రంలోనే యుద్ధం జరుగుతుందని ఒక డైలాగ్ తో చెప్పారని పరుచూరి అన్నారు.
ఈ సినిమాలో మనిషికి బ్రతికేంత ధైర్యం చాలని చంపేంత కాదని డైలాగ్ ఉందని ఈ డైలాగ్ తో ఎన్నో ఆలోచనలు కలిగించారని పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు.
"""/" /
ఇందులోని ప్రతి అంశం రామాయణాన్ని(Ramayana) పోలి ఉంటుందనిపిస్తుందని పరుచూరి పేర్కొన్నారు.
పరుచూరి చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.దేవర మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావాలని పరుచూరి వెల్లడించారు.
దేవర మూవీ ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతోందని తెలుస్తోంది.దేవర సినిమా బిజినెస్ పరంగా అదరగొట్టగా ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా అదరగొడుతుందేమో చూడాల్సి ఉంది.
దేవర హిట్ గా నిలిస్తే దేవర సీక్వెల్ పై కూడా అంచనాలు పెరిగే ఛాన్స్ ఉంది.