అలా చేసి ఉంటే విరాటపర్వం హిట్టయ్యేదా.. పరుచూరి ఏమన్నారంటే?

అలా చేసి ఉంటే విరాటపర్వం హిట్టయ్యేదా పరుచూరి ఏమన్నారంటే?

ఈ మధ్య కాలంలో భారీ అంచనాలతో విడుదలై ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సినిమాలలో విరాటపర్వం సినిమా కూడా ఒకటి.

అలా చేసి ఉంటే విరాటపర్వం హిట్టయ్యేదా పరుచూరి ఏమన్నారంటే?

భీమ్లా నాయక్ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న రానాకు విరటపర్వం ఫలితంతో భారీ షాక్ తగిలింది.

అలా చేసి ఉంటే విరాటపర్వం హిట్టయ్యేదా పరుచూరి ఏమన్నారంటే?

సాయిపల్లవి క్రేజ్ వల్ల అయినా ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా జరిగింది.

విరాటపర్వం సినిమా గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.విరాటపర్వం మూవీ సాయిపల్లవి మోనో యాక్షన్ మూవీ అని సినిమా ఆద్యంతం ప్రేక్షకుల చూపు సాయిపల్లవి పైనే ఉంటుందని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.

ఈ సినిమా ప్రేక్షకుల చూపు అంతా సాయిపల్లవి పైనే ఉంటుందని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు.

400 సినిమాలకు రాసిన నేను విరాటపర్వం మూవీ చూసిన సమయంలో ఆమెనే చూస్తూ ఉండిపోయానని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.

"""/" / అన్ని రకాల భావోద్వేగాలను సాయిపల్లవి అద్భుతంగా పలికించిందని పరుచూరి గోపాలకృష్ణ పేర్కొన్నారు.

విరాటపర్వం మూవీకి సాయిపల్లవికి జాతీయ ఉత్తమ నటి అవార్డ్ వస్తుందేమో అని అనిపిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.

సరైన సమయంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాకపోవడం ఈ సినిమా ఫెయిల్యూర్ కు కారణమని ఆయన కామెంట్లు చేశారు.

ప్రస్తుతం ప్రజలు కమర్షియల్ సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారని ఆయన వెల్లడించారు.సినిమాలో కథ, కథనం అద్భుతంగా ఉన్నాయని క్లైమాక్స్ హృదయ విదారకంగా ఉందని ఆయన కామెంట్లు చేశారు.

సినిమాటిక్ అడ్వాంటేజ్ తీసుకుని ఉంటే ఈ సినిమా రిజల్ట్ మరో విధంగా ఉండేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

రవన్న వెన్నెలకు పెళ్లి చేసి చివరికి వాళ్లిద్దరూ కలిసినట్లు చూపించి ఉంటే సినిమా రిజల్ట్ మరోలా ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు.

పరుచూరి ఈ సినిమా గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చిన్న వయసులోనే ముఖంపై ముడతలా.. ఇలా వ‌దిలించుకోండి!

చిన్న వయసులోనే ముఖంపై ముడతలా.. ఇలా వ‌దిలించుకోండి!