పార్టీ ఎవరికీ అన్యాయం చేయదు..: మంత్రి అంబటి

ఏపీలో బీసీలకు సీఎం జగన్ గౌరవం ఇస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు( Ambati Rambabu ) అన్నారు.

ఇందులో భాగంగానే నరసరావుపేట సీటు బీసీ వర్గానికి ఇచ్చి బీసీలకు పెద్దపీట వేశారని తెలిపారు.

"""/" / సీఎం జగన్( CM Jagan ) కు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విశ్వాసపాత్రుడని మంత్రి అంబటి పేర్కొన్నారు.

అనిల్ ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.శ్రీకృష్ణ దేవరాయలుకు టికెట్ కేటాయించలేదని తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు.

శ్రీకృష్ణదేవరాయలును గుంటూరు వెళ్లాలని సీఎం చెప్పారన్న ఆయన ఓడిపోతే రాజ్యసభ ఇస్తామని జగన్ హామీ ఇచ్చారని తెలిపారు.

అయినా శ్రీకృష్ణ దేవరాయలు పార్టీని వీడారని పేర్కొన్నారు.పార్టీ ఎవరికీ అన్యాయం చేయదని స్పష్టం చేశారు.

పార్టీ నిర్ణయాలను అందరూ గౌరవించాలని తెలిపారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్15, ఆదివారం2024