వంశీ పై బాబు నిస్సహాయత ? అదే కొంప ముంచిందా ? 

టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా తన వ్యక్తిగత ,కుటుంబ సభ్యుల అంశాన్ని పదే పదే  తమ రాజకీయ ప్రత్యర్ధులు ప్రస్తావిస్తూ , విమర్శలు చేయడం పై చంద్రబాబు తీవ్ర అవేదన చెందుతూ ఉన్నారు.

ఇంత అవమానం నా జీవితం లో ఎదుర్కోలేదు అంటూ  కన్నీళ్లు పెట్టుకున్నారు.అసలు చంద్రబాబు కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా విమర్శించింది టిడిపి ఎమ్మెల్యేనే.

ఆయన కూడా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వాడే.2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ  ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ ఆ తరువాత వైసిపికి దగ్గరయ్యారు.

వైసీపీలో చేరనున్న పరోక్షంగా ఆ పార్టీ మద్దతు ఇస్తూ,  అనధికారికంగా ఆ పార్టీ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

ఆయన టీడీపీ కి దూరమై వైసీపీకి దగ్గరయ్యే సమయంలోనే అనుచిత వ్యాఖ్యలు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పైన చేశారు.

ఇప్పటికీ సందర్భం వచ్చినప్పుడల్లా వంశీ ఘాటు పదజాలంతో చంద్రబాబు లోకేష్ పై విరుచుకు పడుతూనే ఉంటారు.

అంతేకాదు వైసీపీని జగన్ ను ప్రశంసిస్తూ అనేక విమర్శలు బహిరంగంగా చేస్తూ ఉంటారు.

అయినా ఎప్పటి నుంచో ఆయనపై చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు ధైర్యం చేయలేకపోతున్నారు. """/" / పార్టీ నుంచి బహిష్కరిస్తూ నేరుగా వైసీపీ లో చేరి అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతారు అనే ఆలోచనతో బాబు ఇంతగా నాన్చుడు ధోరణితో ఉంటున్నారు.

ఇదే అదునుగా వంశీ తన నోటికి పని చెబుతూ వస్తున్నారు.సాంకేతికంగా ఇప్పటికీ వంశీ టీడీపీ ఎమ్మెల్యే గానే కొనసాగుతున్నారు.

అంటే సొంత పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్న వంశీ చేసిన వ్యక్తిగత విమర్శలకు బాబు కన్నీళ్లు కార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇప్పుడు ఇంత వ్యవహారం చోటు చేసుకున్న తర్వాత అయినా, బాబు వంశీ విషయంలో నాన్చకుండా పార్టీ నుంచి బహిష్కరణ వేటు వేయాలనే డిమాండ్ సొంత పార్టీ నాయకుల నుంచే వ్యక్తం అవుతోందట.

సుజీత్ నాని తో చేయబోయే సినిమా ఆ హాలీవుడ్ సినిమా నుంచి కాపీ చేశారా..?