Kolusu Parthasarathy : నూజివీడు టీడీపీ ఇంఛార్జ్ గా పార్థసారథి..!

నూజివీడు( Nuziveedu ) నియోజకవర్గ టీడీపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

నూజివీడు టీడీపీ ఇంఛార్జ్ గా పార్థసారథి( Kolusu Parthasarathy )ని నియమించారు.ఈ క్రమంలోనే రానున్న ఎన్నికల్లో నూజివీడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఆయన బరిలో దిగనున్నారు.

"""/" / కాగా నూజివీడు టీడీపీ ఇంఛార్జ్ గా మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వర రావు( Muddaraboina Venkateswararao: ) వ్యవహారించారు.

నూజివీడు టికెట్ ను పార్థసారథికి ఇస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన గత కొన్ని రోజులుగా పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ముద్దరబోయినకు సర్దిచెప్పేందుకు టీడీపీ హైకమాండ్ ప్రయత్నించినప్పటికీ ఆయన రాజీపడలేదు.అంతేకాకుండా నిన్న తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ముద్దరబోయిన సీఎం జగన్ తో సమావేశం అయ్యారు.

ఈ నేపథ్యంలో పార్థసారథిని నూజివీడు టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు.

సీఎం రేవంత్ ఆదేశించారు… తెలంగాణ వచ్చేయమంటున్న హీరో నాగార్జున ?