పక్కింట్లో మహిళ అరుపులు అంటూ ఫిర్యాదు, పోలీసులు వచ్చి చూసి షాక్
TeluguStop.com
అమెరికాలోని ఫ్లోరిడాలోని ఒక ఇంటికి పోలీసులు వెళ్లారు.అంత మంది పోలీసులు ఒక్కసారిగా ఇంటికి రావడంతో ఇంటి యజమాని కాస్త ఆశ్చర్యపోయాడు.
ఆ తర్వాత ఏం జరిగింది ఆఫీసర్స్ అంటూ పోలీసులను ఇంటి యజమాని ప్రశ్నించాడు.
అప్పుడు పోలీసులు మీ ఇంట్లోంచి మహిళ కాపాడండి అంటూ అరుస్తున్నట్లుగా మాకు కంప్లైంట్ వచ్చిందని అన్నారు.
అందుకే మీ ఇంట్లో సెర్చ్ చేయాలని, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ యజమానిని ప్రశ్నించాడు.
వెంటనే ఆ యజమాని నవ్వుతూ పోలీసులకు అసలు విషయం చెప్పాడు. """/"/తమ ఇంట్లో ఉండే పెంపుడు రామచిలుకకు మాటలు వస్తాయని, అదే ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుందని చెప్పాడు.
అదే రామ చిలుక సరదాగా హెల్ప్ మీ హెల్ప్ మీ అంటూ ఇంతకు ముందు అరిచింది.
అదే మాటలు విని మీకు ఎవరో సమాచారం ఇచ్చి ఉంటారు అంటూ ఆ యజమాని చెప్పాడు.
అదే సమయంలో ఆ రామ చిలుకతో కూడా మాట్లాడించాడు.పోలీసులకు ఆ చిలుకతో హాయ్ చెప్పించడంతో పాటు హెల్ప్ అంటూ కూడా అరిపించాడు.
దాంతో పోలీసులు అక్కడ నుండి నవ్వుకుంటూ వెళ్లారు. """/"/ఇంతకు పోలీసులకు ఫోన్ చేసింది ఎవరు అంటే ఆ ఇంటికి పక్కన ఉండే వారే.
ఇంటి నుండి అరుపులు పదే పదే వస్తుండటంతో అనుమానంతో ఆ ఇంటి పక్కన ఉండే ఇంట్లోని ఒక మహిళ పోలీసు హెల్ప్ లైన్‌కు చేసి ఒక లేడీ హెల్ప్ అంటూ అరుస్తుంది.
ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటూ సహాయం కోరింది.దాంతో వెంటనే వారు పోలీసులను పంపించారు.
పోలీసులు వచ్చి చూస్తే అసలు విషయం ఏంటో అర్థం అయ్యింది.ఫిర్యాదు చేసిన మహిళపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే పోలీసులు అక్కడ నుండి వెళ్లి పోయారు.
వీడియో వైరల్: షోయబ్ అక్తర్ కు టీ రుచి చూపించిన డాలీ చాయ్