శ్రీవారి సేవలో పాల్గొన్న పార్లమెంట్ ఎస్టిమేట్ కమిటీ
TeluguStop.com
తిరుమల( Tirumala ) శ్రీవారిని పార్లమెంట్ ఎస్టిమేట్ కమిటీ సభ్యులు దర్శించుకున్నారు.బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో కమిటీ చైర్మన్ సంజయ్ జైస్వాల్( Sanjay Jaiswal ).
20 మంది కమిటీ సభ్యులు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో కమిటీ సభ్యులకు వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
ఆలయం వెలుపల కమిటీ చైర్మన్ సంజయ్ జైస్వాల్ మాట్లాడుతూ….కమిటీ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రసాద యోజన అమలు ఎలా జరుతుందో పరిశీలించడానికి తిరుమలకు రావడం జరిగిందని తెలిపారు.
తిరుపతిలో ఉన్న ఇండియన్ క్యూలినరీ ఇంటిస్ట్యూట్( Indian Culinary Institute ) ను సందర్శించనునట్లు తెలిపారు.
ఈ ఇనిస్టిట్యూట్ మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో లభ్యం అయ్యే ఆహారాలను ప్రపంచానికి పరిచయం చేయనున్నాం అన్నారు.
ప్రవాసీ భారతీయ దివస్ .. ఎన్ఆర్ఐలకు అడ్వైజరీ జారీ చేసిన ఒడిషా ప్రభుత్వం