వాహనం పార్క్ చేస్తే బ్యాటరీ మాయం

సూర్యాపేట జిల్లా:యువత చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు.

బుధవారం కోదాడ పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో పోలీసులకు పట్టుబడ్డ బ్యాటరీ దొంగల వివరాలను ఎస్పీ విలేకరులకు వెల్లడించారు.

కోదాడ పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీకి చెందిన జిల్లేపల్లి రమేష్, శ్రీరంగాపురానికి చెందిన పనస మహేష్,వంకా నరేష్ ముగ్గురు కలిసి పార్కింగ్ చేసిన వాహనాల బ్యాటరీలు దొంగిలించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు.

కోదాడ పట్టణంలో ఐదు,కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోఒకటి,హుజూర్ నగర్ స్టేషన్ పరిధిలో,మునగాల స్టేషన్ పరిధిలో ఒకటి మొత్తం 13 కేసుల్లో 40 బ్యాటరీలను చోరీ చేశారని తెలిపారు.

వీటి విలువ సుమారు 4 లక్షల రూపాయల వరకు ఉంటుందన్నారు.చోరీ చేసిన బ్యాటరీలను లారీలో విజయవాడ తరలించి విక్రయించేందుకు వెళుతుండగా నమ్మదగిన సమాచారంతో సిఐ శివశంకర్,ఎస్ఐ రాంబాబులు కోదాడ పట్టణంలో పట్టుకున్నట్లు తెలిపారు.

నేరస్తులను విచారించగా నేరం అంగీకరించారని,వారి వద్ద నుండి నలభై బ్యాటరీలు మూడు మొబైల్ ఫోన్లు,ఒక గ్లామర్ బైక్ స్వాధీనం చేసుకుని,నేరస్తులను రిమాండ్ కు తరలించామన్నారు.

కేసును చాకచక్యంగా ఛేదించిన కోదాడ సిఐ శివశంకర్,ఎస్ఐలు రాంబాబు, నాగభూషణంలకు రివార్డును ప్రకటించారు.

ఈ సమావేశంలో డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి,సిఐ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదేందయ్యా ఇది.. స్వర్గంలో మీటర్ స్థలం రూ.8,000… కొనుక్కోడానికి ఎగబడుతున్న జనం..?