కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన డాక్టర్ బాబు.. ఘనంగా గృహప్రవేశ వేడుకలు!
TeluguStop.com
కార్తీక దీపం( Karthika Deepam ) సీరియల్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటుడు పరిటాల నిరుపమ్( Paritala Nirupam ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
చంద్రముఖి సీరియల్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నిరుపమ్ పలు బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ సందడి చేశారు.
అయితే కార్తీకదీపం సీరియల్ ద్వారా ఈయనకు ఎంతో మంచి పేరు వచ్చింది.కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన ప్రస్తుతం కార్తీకదీపం 2 సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
"""/" /
ప్రస్తుతం ఈ సీరియల్ ఎంతో అద్భుతమైన రేటింగ్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది.
సీరియల్ ద్వారా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.
ఇక డాక్టర్ బాబు భార్య మంజుల ( Manjula )కూడా సీరియల్ నటి అనే సంగతి తెలిసిందే.
ఈమె యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి వారికి సంబంధించిన అన్ని విషయాలను యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటారు.
ఇక మంజుల సైతం పలు సీరియల్స్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. """/" /
ఇకపోతే శ్రీరామనవమి పండుగ సందర్భంగా మంజుల నిరుపమ్ దంపతులు అభిమానులతో శుభవార్తను పంచుకున్నారు.
ఇప్పటివరకు నిరుపమ్ అండ్ ఫ్యామిలీ అద్దె ఇంట్లోనే నివసిస్తూ వచ్చారు.అయితే ఇప్పుడు సొంతంగా ఫ్లాట్ కొనుగోలు చేసి.
సొంతింటి కల నెరవేర్చుకున్నారట.ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులతో పంచుకున్నారు.
ప్రస్తుతం వీరి నూతన గృహప్రవేశానికి ( New House Warming ) సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక మంజుల సైతం తన కొత్త ఇంటి కన్స్ట్రక్షన్ కి సంబంధించిన విషయాలు అన్నింటిని కూడా ఎప్పటికప్పుడు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేసేవారు.
‘పుష్ప 2’ ఇండస్ట్రీ హిట్ కొట్టడానికి లైన్ క్లియర్ అయిందా..?