కాబోయే భర్తతో కలిసి ప్లేట్లు కడిగిన హీరోయిన్.. ఎవరో తెలుసా?

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా( Parineeti Chopra ) గురించి మనందరికీ తెలిసిందే.

ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చెల్లెలు అన్న విషయం మనందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా హీరోయిన్ పరిణితి చోప్రా పేరు సోషల్ మీడియాలో మారు మోగిపోతోంది.

అయితే అందుకు గల కారణం కూడా లేకపోలేదు.ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్ధాతో( AAP MP Raghav Chadha ) కలిసి ఆమె వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే.

గత కొంతకాలంగా ఈ జంట ప్రేమలో మునిగితేలుతున్నారు.ఇటీవల మే 13న ఈ జంట ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.

"""/" / ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకుని తమ బంధాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు.

కాగా త్వరలోనే వీరి వివాహం ఘనంగా జరగనుంది.రాజస్థాన్‌లోని ఒక ఫేమస్‌ ప్యాలెస్‌లో( Famous Palace ) పరిణీతి, రాఘవ్‌లు డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోనున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలో పెళ్లికి ముందు అమృత్‌సర్‌ లోని గోల్డెన్‌ టెంపుల్‌ను దర్శించుకున్నారు పరిణీతి, రాఘవ్.

అనంతరం అన్నదాన సత్రంలోకి వెళ్లి ప్లేట్లు కడిగే సేవలో పాల్గొన్నారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

"""/" / స్వర్ణదేవాలయం సందర్శన సందర్భంగా పరిణీతి తెల్లటి కుర్తా, సల్వార్ ధరించి తన దుపట్టాతో తల కప్పుకుంది.

ఇక ఎంపీ రాఘవ్ తెల్లటి కుర్తా-పైజామాలో బూడిద రంగు నెహ్రూ జాకెట్‌తో కనిపించాడు.

ఆ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ జంట చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

చాలా సింప్లిసిటీ గా ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా పరిణీతి చోప్రా 2011లో లేడీస్‌ వర్సెస్‌ రిక్కీ బాల్‌ సినిమాతో బాలీవుడ్‌ తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత ఇషాక్‌ జాదే, శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌, హస్సీ తో ఫస్సీ, డిష్యూమ్‌, మేరి ప్యార్‌ బిందూ, గోల్‌మాల్‌ అగైన్‌, నమస్తే ఇంగ్లండ్‌, కేసరి, జబ్‌రియా జోడీ, ది గర్ల్‌ ఆన్‌ ది ట్రైన్‌, సైనా లాంటి సినిమాలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది పరిణీతి చోప్రా.

ఖాళీ క‌డుపుతో ఈ ఆకులు తింటే రక్తశుద్ధితో స‌హా బోలెడు ఆరోగ్య లాభాలు!