ముస్లిం అయినా వినాయకుని మండపం పెట్టిన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్.. దేవుడు అన్నిట్లో ఉన్నాడంటూ?
TeluguStop.com
పరేషాన్ బాయ్స్( Pareshaan Boys ) యూట్యూబ్ ఛానల్ ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్( Imran Khan ) ఒకరు.
యూట్యూబ్ ద్వారా సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని ఇమ్రాన్ సహాయం చేస్తారు.ముస్లిం అయినా వినాయక చవితి( Vinayaka Chavithi ) మండపాన్ని ఏర్పాటు చేసిన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ముస్లింలు వినాయకుడిని పెట్టవచ్చు కానీ మేము కొబ్బరికాయ దేవుని దగ్గర కొట్టకూడదని తెలిపారు.
మా గ్రూప్ లో ఒకరు హిందూ నేను ముస్లిం ఇంకొకరు క్రిస్టియన్ అని అందరూ కలిసిమెలిసి ఉండాలనే మెసేజ్ ను మేము ఇస్తున్నామని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.
గతంలో మా ఫ్రెండ్స్ వినయకుడి మండపం పెట్టేవారని ఈసారి నేను పెట్టాలని భావించి వినాయకుడి మండపం పెట్టానని నాకు మంచి జరిగిందని భవిష్యత్తులో కూడా వినాయకుడి మండపం పెడతానని ఆయన చెప్పుకొచ్చారు.
"""/" /
దేవుడు అన్నిట్లో ఉన్నాడని నమ్మాలి అంతేనని నమ్మితే మనకు మంచి జరుగుతుందని పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.
నాకు నెగిటివ్ అయితే ఏం రాదని రాజకీయ నాయకులు కొట్లాటలు చేస్తారని ఆయన అన్నారు.
మనమంతా ఒక్కటే అనే మెసేజ్ ఇస్తున్నానని మొత్తం 8 లక్షల రూపాయలు ఖర్చు అవుతోందని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు.
చందాలు ఎవరినీ అడగలేదని ఆయన తెలిపారు. """/" /
నిమజ్జనం కూడా భారీ లెవెల్ లో ప్లాన్ చేశానని ఇమ్రాన్ ఖాన్ కామెంట్లు చేశారు.
వినాయకుడిని నిమజ్జనం చేయాలంటే బాధ వేస్తుందని ఆయన తెలిపారు.వినాయకుడిని పెట్టడంతో బబ్బూ ( Babbu ) ఎంతో సంతోషించాడని ఆయన కామెంట్లు చేశారు.
నేను శ్రీశైలం కూడా వెళ్తానని అక్కడికి వెళ్లాక మంచి జరిగిందని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు.
పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయిన టేస్టీ తేజ ఎన్ని లక్షలు సంపాదించారో తెలుసా?