అధిక బరువు సమస్యతో బాధపడుతున్న పిల్లల కోసం తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
TeluguStop.com

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.


అధిక బరువు సమస్యకు ముఖ్య కారణం నేటి సమాజంలోని ఆహారపు అలవాట్లు నియంత్రణలో లేకపోవడం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


శరీర బీఎంఐ 30 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే స్థూలకాయం గా చెబుతూ ఉంటారు.
అయితే ఈ అధిక బరువు నుంచి పిల్లలను కాపాడడానికి తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.పిల్లలు అతిగా బరువు పెరగడానికి వారికి శారీరిక శ్రమ లేకపోవడమే ఒక ముఖ్య కారణం.
ఊబకాయం నుంచి పిల్లలను బయటపడాలంటే వారికి ప్రతిరోజు గ్రౌండ్ కు వెళ్లేలా తల్లిదండ్రులు అలవాటు చేయాలి.
అలాంటి సౌకర్యం లేనివారు ఇంట్లోనే ప్రతిరోజు పిల్లలతో క్రమం తప్పకుండా వారి శరీరానికి శ్రమ కలిగే ఆటలను ఆడిస్తూ ఉండాలి.
దీనివల్ల పిల్లలు బరువు తగ్గడమే కాకుండా రోజంతా ఎంతో చురుకుగా ఉంటారు.చాలామంది పిల్లలకు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వారికి తెలియదు.
కాబట్టి పిల్లలు ఎక్కువగా వారికి రుచిగా అనిపించే ఫాస్ట్ ఫుడ్స్ కు పిల్లలు దూరంగా ఉంచి ఇంట్లోనే ఆరోగ్యకరమైన ఆహారాన్ని పిల్లలకు తల్లిదండ్రులు అందించాలి.
"""/"/
ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వచ్చాక చాలా మంది పిల్లలు బయటకు వెళ్లి ఆటలు ఆడడం మర్చిపోతున్నారు.
స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పటి నుంచి నిద్రపోయే వరకు చేతిలో కచ్చితంగా ఫోన్ ఉండాల్సిందే.
దీనివల్ల పిల్లల నిద్ర పై ప్రభావం పడి వారు బరువు పెరిగే అవకాశం ఉంది.
ఇలాంటి వాటికి పిల్లలను దూరంగా ఉండేలా చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత.చిన్నపిల్లలు ప్రతిరోజు తగినంత సమయం నిద్రపోతే మరుసటి రోజు ఎంతో హుషారుగా ఉంటారు.
ఇలా వారు హుషారుగా ఉండడం వల్ల పిల్లలలో ఊబకాయం వంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
వెంకటేష్ నెక్స్ట్ సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడా..?