ఆ ప్రేమ పక్షులకు తల్లిదండ్రులు విగ్రహాలు ఏర్పాటు.. అసలు కథ తెలిస్తే!!

పిల్లలు తాము ఎవరినైనా ప్రేమించామని చెప్తే చాలు తల్లిదండ్రులు ఆటోమేటిక్‌గా కోప్పడతారు.వారి ప్రేమను అసలు అంగీకరించరు.

వారికి ప్రేమ పెళ్లి చేసేందుకు ససేమీరా అంటారు.ఎందుకంటే తమ పిల్లలు తెలియక ఎక్కడ తమ జీవితాల్ని పాడు చేసుకుంటారేమోనని భయపడుతుంటారు.

కానీ తమ పిల్లల ప్రేమను అర్థం చేసుకోలేరు.అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించరు.

దీనివల్ల ఎంతో మంది ప్రేమికులు తల్లిదండ్రులను ఒప్పించడానికి కష్టపడుతూనే ఉంటారు.ఒప్పుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటారు.

లేదంటే వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారు.తర్వాత తల్లిదండ్రుల ఆగ్రహానికి గురై జీవితాంతం కృంగిపోతుంటారు.

ఇలాంటి ఘటనలు ఎప్పటికీ ఎన్నో వెలుగు చూశాయి.గుజరాత్‌లోని తాపి నివాసులైన గణేష్‌, రంజనాలు అనే ప్రేమ పక్షులు కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ కుటుంబ సభ్యులందరూ ఒప్పుకోలేదు.

దాంతో వారు ఆత్మహత్య చేసుకున్నారు. """/"/ అయితే తాము వారి ప్రేమను అర్థం చేసుకోకుండా ఎంత తప్పు చేశామో కుటుంబ సభ్యులు చివరికి గ్రహించారు.

తమ తప్పును క్షమించమని చనిపోయిన తమ పిల్లలను వేడుకుంటూ వారి కోసం రెండు విగ్రహాలు ఏర్పాటు చేశారు.

ఆ రెండు విగ్రహాలకు ఘనంగా పెళ్లి చేశారు.ఈ ప్రేమికుల 2022, ఆగస్టు నెలలో ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నారు.

అప్పట్లో ఈ ఘటన కుటుంబ సభ్యులను ఎంతగానో కలిచి వేసింది. """/"/ వారు ఆ బాధను జీర్ణించుకోలేక ఎన్నో రోజులు మానసిక క్షోభను అనుభవించారు.

చివరికి బతికుండగా ఎలాగూ వారికి పెళ్లి చేయలేకపోయాం, కనీసం వారి విగ్రహాలకైనా పెళ్లి చేద్దామనుకుంటూ వారు ఈ పని చేశారు.

దీని గురించి తెలుసుకున్న స్థానికులు పిల్లల ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.లేదంటే వారి లైఫ్ ను వారికి వదిలేయాలి.

పెళ్లి చేసుకోకూడదు అని ఒత్తిడి చేయకూడదంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఆ విషయం లో ఎన్టీయార్ ను ఫాలో అవుతున్న రామ్ చరణ్…కారణం ఏంటంటే..?