పరశురామ్ చేస్తున్న తప్పులివేనా.. ఫ్యామిలీస్టార్ కు నెగిటివ్ టాక్ రావడానికి 5 కారణాలివే!
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడు పరశురామ్( Director Parasuram ) కు ప్రత్యేక గుర్తింపు ఉంది.
యువత సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పరశురామ్ తొలి ప్రయత్నంలోనే హిట్ అందుకున్నారు.పరశురామ్ రెండో సినిమా రవితేజ హీరోగా ఆంజనేయులు( Anjaneyulu ) టైటిల్ తో తెరకెక్కగా ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా మాత్రం హిట్ గా నిలిచింది.
మూడో ప్రయత్నంలో సోలో సినిమాతో పరశురామ్ మరో సక్సెస్ అందుకున్నారు.సారొచ్చారు సినిమాతో పరశురామ్ ఖాతాలో భారీ ఫ్లాప్ చేరింది.
సారొచ్చారు సినిమా( Sarocharu ) నిర్మాతలకు భారీ నష్టాలను మిగల్చడంతో కొన్నేళ్ల పాటు పరశురామ్ కు మూవీ ఆఫర్లు రాలేదు.
2016 సంవత్సరంలో శ్రీరస్తు శుభమస్తు సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన పరశురామ్ ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు.
"""/"/ శ్రీరస్తు శుభమస్తు( Srirastu Subhamastu ) సక్సెస్ తర్వాత గీతా గోవిందం సినిమాతో పరశురామ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నారు.
మరోవైపు విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కూడా గీతా గోవిందం అనే సంగతి తెలిసిందే.
గీతా గోవిందం సక్సెస్ తో పరశురామ్ కు మహేష్ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ రాగా సర్కారు వారి పాట సినిమా( Sarkaru Vaari Paata ) యావరేజ్ సినిమాగా నిలిచింది.
కొన్ని ఏరియాలలో ఈ సినిమాకు నష్టాలు సైతం వచ్చాయి.ఫ్యామిలీ స్టార్ తో సైతం పరశురామ్ మరో భారీ హిట్ ను అందుకోలేకపోయారు.
"""/"/
రొటీన్ కథ, కథనం, విజయ్ దేవరకొండ డైలాగ్ డెలివరీ, సెకండాఫ్, కొన్ని సన్నివేశాల్లో మృణాల్ యాక్టింగ్, పాటలు ఆసక్తికరంగా లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయ్యాయి.
ఫ్యామిలీ స్టార్ కు 43 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగిందని సమాచారం అందుతోంది.
ఫ్యామిలీ స్టార్ సినిమా( Family Star )కు విజయ్ దేవరకొండ భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం అందుతోంది.
అల్లు అర్జున్ అరెస్ట్ కన్నీళ్లు పెట్టుకున్న స్నేహ రెడ్డి.. భార్యను ఓదార్చిన బన్నీ!