కార్తీ సినిమాకు పరశురామ్ అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్నాడా?

టాలీవుడ్ లో ఈ మధ్య పారితోషికాల గురించి భారీ చర్చ జరుగుతుంది.తమ టైం అండ్ డిమాండ్ ను బట్టి పారితోషికాలు మారుతూ ఉన్నాయి.

అందరు పాన్ ఇండియా బాట పట్టడంతో పారితోషికాలు కూడా అమాంతం పెరిగి పోయాయి.

ఎవరి సక్సెస్ రేటును బట్టి వారు రెమ్యునరేషన్స్ వసూలు చేస్తున్నారు.హీరో హీరోయిన్ల నుండి డైరెక్టర్లు వరకు అంతా కూడా ఒక్క సక్సెస్ పడితే చాలు అమాంతం పెంచుతూ పోతున్నారు.

మరి ఈ లిస్టులో ఇప్పుడు మరో డైరెక్టర్ చేరినట్టు తెలుస్తుంది.పరశురామ్ పెట్ల.

ఈయన టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితం అనే చెప్పాలి.ఈ మధ్యనే ఈయన మహేష్ బాబుతో చేసిన సర్కారు వారి పాట సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమా హిట్ తర్వాత పరశురామ్ మరో రెండు సినిమాలను లైన్లో పెట్టుకున్నాడు.

"""/"/ పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబోలో దిల్ రాజు ఒక సినిమాను ప్రకటించిన విషయం విదితమే.

ఇక ఈ సినిమాతో పాటు తమిళ్ స్టార్ హీరో కార్తీతో కూడా పరశురామ్ సినిమా చేస్తున్నాడు.

ఇటీవలే చెన్నై వెళ్లి మరీ కథ చెప్పి కార్తీతో ఓకే చేయించుకుని వచ్చాడు.

ఈ సినిమాకు 'రెంచ్ రాజు' అనే టైటిల్ ను కూడా ఖరారు చేసినట్టు తెలుస్తుంది.

ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. """/"/ ఆగస్టు నుండి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా కోసం పరశురామ్ ఏకంగా 20 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు టాక్.

తెలుగు, తమిళ్ లో ఏకకాలంలో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఈయన అడిగినంత ఇచ్చేందుకు మేకర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

గీత గోవిందం కోసం 10 కోట్లు తీసుకున్న ఈయన సర్కారు కోసం 13 వసూలు చేశారట.

ఇక ఇటీవలే ప్రకటించిన విజయ్ మూవీ కోసం 15 తీసుకోగా కార్తీ ప్రాజెక్ట్ కోసం 20 డిమాండ్ చేస్తున్నారు.

మొత్తానికి పరశురామ్ సక్సెస్ లో ఉండడంతో ఈయన అడిగినంత ఇవ్వడానికి మేకర్స్ ఓకే చెప్పారు.

బయట రూ.100, 200లకు చెప్పులు, బూట్లు కొంటున్నారా? అవి ఎక్కడి నుంచి వస్తాయంటే?