పరమేశ్వరుడికి లింగ రూపం తప్ప ఇంకా ఏ రూపాలు లేవా?
TeluguStop.com
పరమేశ్వరుడికి కేవలం లింగ రూపం ఒకటే ఉందా మరేమైనా రూపాలున్నాయా అంటే.చాలా రూపాలున్నాయని శైవాగమాలు ప్రకటిస్తున్నాయి.
వివిధ సందర్భాల్లో పరమేశ్వరుడు అవతరించిన 175 రూపాలు గురించి ఇందులో వివిరించారు.వీటిలో సాధారణంగా మనం అర్చన చేసి, అభిషేకం చేసేది ఒక్క శివలింగానికే.
కానీ స్వామి అవతరించిన సందర్భం, సాక్షాత్కరించిన రూపం ఆధారంగా శివుడి రూపాల్ని విభజించారు.
వీటిని గురించి శైవాగమ ధ్యాన రత్నావళి అనే గ్రంథంలో పూర్తిగా తెలిపారు.అదే.
బ్రహ్మదేవుడు సృష్టికర్తగా ప్రసిద్ధి పొందినప్పటికీ.అతడిని సృష్టించింది, అతడికి సృష్టించే శక్తినిచ్చింది ఆ భోళా శంకురుడే అని ఆగమాలు చెబుతున్నాయి.
విష్ణువు కూడా నిరంతరం పరమేశ్వరుడినే ధ్యానిస్తాడని అందులో ఉంది. ఆయా సందర్భాల్లో తనలోని సృష్టి లక్షణాన్ని ప్రకటిస్తూ.
స్వామి కొన్ని అవతారాలను ధరించారు.అందులో మొదటిది సంహార రూపాలు.
శివుడు లింగమూర్తిగా, లింగోద్భవ మూర్తిగా, కల్యాణ సుందర మూర్తిగా, చంద్ర శేఖర మూర్తిగా, గంగాధర మూర్తిగా కనిపించినట్లు వివరించారు.
రెండోది స్థితి రూపాలు.జలంధర హర మూర్తి, త్రిపుర సంహార మూర్తి, మన్మథ సంహార మూర్తి, గజ సంహార మూర్తి, కాల సంహార మూర్తిగా అవతరించినట్లు శైవాగమ ధ్యాన రత్నావళి చెబుతోంది.
""img Src=" " /
మూడోది అనుగ్రహ రూపాలు.సోమా స్కంద మూర్తి, అర్ధ నారీశ్వర మూర్తి, హరి హర మూర్తి, కిరాత మూర్తి, నటరాజ మూర్తిగా అవతారాలెత్తాడట ఆ పరమ శివుడు.
నాలుగోది తిరోధాన పూరాలు.చండేశాను గ్రహమూర్తి, విఘ్న ప్రసాద మూర్తి, చక్ర ప్రదాన మూర్తి, వృషారూఢ మూర్తి, దక్షిణా మూర్తిగా కూడా అవతారమెత్తినట్లు శైవాగమ ధ్యాన రత్నావళిలో వివరించబడింది.
రామ్ చరణ్ తో ఫ్రెండ్షిప్ చేయడం చాలా హ్యాపీ గా ఉంటుంది అంటున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్…