డైరెక్టర్ గట్స్ కు హాట్సాఫ్… బేబీ సినిమాపై పరుచూరి విశ్లేషణ!

సాయి రాజేష్( Sai Rajesh )దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ( Anand Devarakonda )వైష్ణవి చైతన్య ( Vaishnavi Chaitanya )హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బేబీ( Baby )ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈ సినిమా గురించి తాజాగా పరుచూరి గోపాలకృష్ణ( Parachuri Gopalakrishna ) తన పరుచూరి పలుకుల ద్వారా ఈ సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.ఎందుకో నా గుండె అదురుతుందన్న డైలాగ్ ఎంతో అద్భుతంగా ఉందని ఈ డైలాగ్ వచ్చే ముందు విరాజ్ ఎంట్రీ ఇవ్వడం హీరోయిన్ మేకప్ వేసుకోవడం వంటి వాటి ద్వారా ముందుగానే డైరెక్టర్ మనకు హింట్ ఇచ్చారని తెలిపారు.

"""/" / ఇక ఈ సినిమాలో హీరోయిన్ చిన్న తప్పు చేసింది ఆ తప్పు ప్రియుడుతో చెప్పి ఉంటే సినిమా క్లైమాక్స్ మరోలా ఉండేది కానీ ఆ తప్పును సరిదిద్దడం కోసం మరో పెద్ద తప్పు చేశారు.

ఆటో తాకట్టు పెట్టి హీరోయిన్ కి హీరో ఫోన్ కొనిస్తాడు కానీ విరాజ్ ఐఫోన్ కొనివ్వడంతో ఆమె తన ప్రియుడు కొనిచ్చిన ఫోన్ డబ్బా ఫోన్ అంటూ పడేస్తుంది.

దీంతో తనని పెళ్లి చేసుకుంటుందా అన్న సందేహం అందరిలోనూ కలిగించారు డైరెక్టర్.ఇక విరాట్ తనని వదిలేయాలి అంటే ఒకసారి తన వద్దకు వెళ్లి వస్తే సమస్య ఇక్కడితో ఆగిపోతుందని ఒక చెడ్డ సలహా ఇస్తుంది హీరోయిన్ స్నేహితురాలు.

"""/" / ఇలా ఒకరితో శారీరకంగా కలిసి చివరికి మరొకరిని పెళ్లి చేసుకొని ఎలా ఈ సినిమా క్లైమాక్స్ ఉంది అయితే ఇలా చేస్తే సినిమాని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టి ఈ పాయింట్ తో కథను ముందుకు తీసుకువచ్చిన డైరెక్టర్ కు నిజంగా హాట్సాఫ్ చెప్పాల్సిందే.

ఈ పాయింట్ పెట్టడం వల్ల తన సినిమా ఏమవుతుందోనని డైరెక్టర్ ఆలోచించలేదు భయపడకుండా సినిమాని ముందుకు తీసుకువెళ్లారు అయితే ప్రస్తుతం సమాజ ధోరణి కూడా ఇలాగే ఉండటంతో జనాలు కూడా ఈ సినిమాని యాక్సెప్ట్ చేశారు.

అయితే హీరోయిన్ ఒకరితో శారీరకంగా కమిట్ అయి మరొకరిని పెళ్లి చేసుకుంది అలా ఉండకూడదు ఈ పాయింట్ మీద సినిమా ఆడకూడదు కానీ ఆడింది అంటే ప్రస్తుతం సమాజం కూడా ఇదే ధోరణిలో ఉంది కనుక సినిమాని ఆదరించారు.

సమాజంలో ఉన్న పరిస్థితులు కళ్లకు కట్టినట్టు ఈ సినిమాలో చూపించడం వల్లే ఈ సినిమా హిట్ అయిందని పరుచూరి తెలిపారు.

ఓరి దేవుడా.. పామును అలా చేస్తున్నావేంటి తల్లి (వీడియో)