పేపర్ లీక్ కేసు.. కస్టడీ పిటిషన్‎పై నాంపల్లి కోర్టులో విచారణ

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో సిట్ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది.

మొత్తం ఏడుగురు నిందితులను కస్టడీకి కోరుతూ సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు.

కాగా ఈ కేసులో ఇప్పటికే నిందితులను ఆరో రోజుల కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే.

అయితే కస్టడీ ముగియడంతో మరోసారి నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోర్టులో సిట్ పిటిషన్ వేసింది.

ఈ నేపథ్యంలో నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్, రాజేశ్వర్, శబిన్, డాక్యాతో పాటు రమేశ్, సురేశ్ లను కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరుతున్నట్లు పిటిషన్ లో పేర్కొన్నారు.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పై పవన్ ప్రశంసలు.. ఆ దర్శకుడి డైరెక్షన్ లో నటిస్తాడా?