ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది.. వందల కోట్లకు అధిపతి అయిన ఈ ఎనిమిదో తరగతి బుడ్డోడి కథ తెలుసా?

ప్రస్తుత కాలంలో టాలెంట్( Talent ) అనేది సక్సెస్ కు సంబంధించి కీలక పాత్ర పోషిస్తుంది.

వయస్సుతో సంబంధం లేకుండా టాలెంట్ తో అంచెలంచెలు ఎదుగుతూ కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో సక్సెస్ అవుతున్న వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందనే విధంగా ఎనిమిదో తరగతి చదువుతున్న ఒక బుడ్డోడు ఏకంగా వందల కోట్ల రూపాయల ఆస్తికి అధిపతి అయ్యాడు.

"""/" / తనకొచ్చిన బిజినెస్ ఐడియాతో తిలక్ మెహతా( Tilak Mehta ) చిన్న వయస్సులోనే ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించి ఎంతోమందికి స్పూర్తిగా నిలిచాడు.

తనకు వచ్చిన ఒక సమస్యను వ్యాపారంగా మార్చుకుని వందల కోట్లు సంపాదిస్తున్న ఈ వ్యక్తి సక్సెస్ స్టోరీ( Tilak Mehta Success Story ) ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పవచ్చు.

తిలక్ మెహతా తన దగ్గర ఉన్న బుక్స్ తీసుకుని ఒకరోజు మేనమామ ఇంటికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే సమయంలో ఆ పుస్తకాలను మరిచిపోయాడు.

డెలివరీ సర్వీస్ ద్వారా ఆ బుక్స్ ను పొందాలని భావించి ఖర్చు మరీ ఎక్కువ మొత్తం ఉండటంతో ఇబ్బంది పడ్డాడు.

మేనమామ ఇంట్లో ఉన్న పుస్తకాలను ఎంత కష్టపడినా తన ఇంటికి మాత్రం తెప్పించుకోలేకపోయాడు.

ఇలాంటి సమస్య వల్ల తనలా మరి కొంతమంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న తిలక్ మెహతా ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం దొరికితే బాగుంటుందని భావించాడు.

"""/" / ముంబై డబ్బావాలాను ప్రేరణగా తీసుకుని పేపర్ అండ్ పార్శిల్స్( Papers N Parcels ) పేరుతో కస్టమర్లకు అవసరమైన అన్ని వస్తువులు ఒకే రోజులో డెలివరీ అయ్యేలా తిలక్ మెహతా కంపెనీని మొదలుపెట్టారు.

పోస్టల్ సేవల కంటే తక్కువ ఖర్చుతో ఈ బిజినెస్ ను మొదలుపెట్టి షిప్పింగ్, లాజిస్టిక్స్ సర్వీసులను ఇందులో చేర్చాడు.

ప్రస్తుతం తిలక్ నెలవారీ ఆదాయం 2 కోట్ల రూపాయలుగా ఉంది.ప్రస్తుతం ఈ సంస్థ టర్నోవర్ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉంది.

ప్రత్యేక నైపుణ్యాలు ఉంటే వయస్సుతో సంబంధం లేకుండా సక్సెస్ కావచ్చని తిలక్ మెహతా ప్రూవ్ చేశారు.

వినూత్నమైన ఆలోచనలతో ముందడుగులు వేసిన తిలక్ మెహతా చిన్న వయస్సులోనే సక్సెస్ సాధించాలని భావించే ఎంతోమంది మనస్సులను గెలుచుకున్నారు.

ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు తాగడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో తెలుసా..?