హెయిర్ ఫాల్‌ను నివారించే బొప్పాయి..ఎలా వాడాలంటే?

ఇటీవ‌ల కాలంలో ఎంద‌రినో వేధించే స‌మ‌స్య హెయిర్ ఫాల్.స్త్రీలే కాదు పురుషులు కూడా ఈ స‌మ‌స్య‌తో తీవ్రంగా కృంగిపోతుంటారు.

ఆహార‌పు అల‌వాట్లు, ఒత్తిడి, పోష‌కాల లోపం, హెయిర్ కేర్ లేక పోవ‌డం, మ‌ద్య‌పానం, ధూమ‌పానం, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల జుట్టు రాలిపోతూ ఉంటుంది.

దాంతో ఈ స‌మ‌స్య‌ను ఎలా త‌గ్గించుకోవాలో తెలియ‌క‌.తెగ మ‌ద‌న ప‌డిపోతూ ఉంటారు.

అయితే హెయిర్ ఫాల్‌కు చెక్ పెట్ట‌డంలో బొప్పాయి పండు అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి కేశాల‌కు బొప్పాయి పండును ఎలా యూజ్ చేయాలి? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా బాగా పండిన బొప్పాయి పండును తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పేస్ట్‌లో ఆలివ్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసి.

త‌ల‌కు, కేశాల‌కు మ‌రియు కుదుళ్ల‌కు ప‌ట్టించాలి.ఇర‌వై, ముప్పై నిమిషాల అనంత‌రం కెమిక‌ల్స్ త‌క్కువ‌గా ఉండే షాంపూ యూజ్ చేసి తల స్నానం చేయాలి.

ఇలా మూడు రోజుల‌కు ఒక‌సారి చేస్తే.హెయిర్ ఫాల్ త‌గ్గు ముఖం ప‌డుతుంది.

అలాగే ఒక బౌల్‌లో బొప్పాయి పండు గుజ్జు మ‌రియు క‌ల‌బంద జెల్ తీసుకుని క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని జుట్టు మొత్తానికి ప‌ట్టించి.అర గంట పాటు వ‌దిలేయాలి.

ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో హెడ్  బాత్ చేయాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే.

హెయిర్ ఫాల్ త‌గ్గ‌డంతో పాటు కేశాలు షైనీగా మార‌తాయి. """/" / ఇక ఒక గిన్నె తీసుకుని.

అందులో బొప్పాయి గుజ్జు, క‌రివేపాకు పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని జుట్టుకు అప్లై చేసుకుని.

ముప్పై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.ఆ త‌ర్వాత మామూలు షాంపూతో తల స్నానం చేసేయాలి.

ఇలా చేసినా కూడా హెయిర్ ఫాల్ స‌మ‌స్య త‌గ్గు ముఖం ప‌డుతుంది.

మంగళగిరిలో టీడీపీ రౌడీ రాజకీయం..!!