బొప్పాయితో ఈ సింపుల్ టిప్స్ ట్రై చేస్తే.. నిగనిగలాడే చర్మం మీసొంతం!

బొప్పాయి పండు గుర్తించి ప్రత్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.నోరూరించే పండ్ల‌లో ఒక‌టైన బొప్పాయి.

ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ పెడుతుంది.

అయితే ఆరోగ్యానికి మాత్ర‌మే కాదు.బొప్పాయి చ‌ర్మ సౌంద‌ర్యాన్ని రెట్టింపు చేయ‌డంలో గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

బొప్పాయిలో ఉండే విట‌మిన్ ఏ, సీ, బీ, డీ లు ఎన్నో చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను నివారిస్తుంది.

మ‌రి బొప్పాయిని చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది తెలుసుకుందాం.ముందుగా బొప్పాయి గుజ్జులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ముఖం మొత్తం ప‌ట్టించాలి.

అర‌గంట పాటు ఆర‌నిచ్చి.అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల‌.చర్మం రంగు మారడంతో పాటు మొటిమ‌ల స‌మ‌స్య త‌గ్గుముఖం ప‌డుతుంది.

అలాగే బొప్పాయి గుజ్జులో కొద్దిగా పచ్చిపాలు, తేనె, పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి బాగా ప‌ట్టించి.పావు గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల చర్మానికి కావాల్సిన‌ తేమ, పోష‌కాలు అంది.ముఖం అందంగా, యవ్వనంగా కనిపిస్తుంది.

ట్యానింగ్ ను తొలగించడానికి కూడా ఈ ప్యాక్ ఉప‌యోగ‌ప‌డుతుంది.ఇక బొప్పాయిగుజ్జులో కొద్దిగా బియ్యంపిండి, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు బాగా ప‌ట్టించి.అర గంట త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల డార్క్ స్పాట్స్ న‌యం అవుతాయి.

అలాగే ముఖంలో కొత్త కాంతి సంత‌రించుకుంటుంది.

యూఎస్ కాంగ్రెస్‌లో ఆరుగురు భారత సంతతి నేతల ప్రమాణ స్వీకారం!!