అక్కడకు కూడా వెళ్తున్న 'దృశ్యం 2'.. చేసేది ఎవరో?

మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ దృశ్యం ను తెలుగు, తమిళం మరియు హిందీ ల్లో రీమేక్ చేసిన విషయం తెల్సిందే.

మలయాళంతో పాటు తెలుగు, తమిళం మరియు హిందీ భాషల్లో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

దృశ్యం కు సీక్వెల్‌ గా మలయాళం లో దృశ్యం 2 రూపొందిన విషయం తెల్సిందే.

అమెజాన్ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్ అయిన దృశ్యం 2 కు మంచి స్పందన వచ్చింది.

భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దృశ్యం 2 సినిమా ను ఇప్పటి కే తెలుగు లో వెంకటేష్‌ మరియు మీనా కీలక పాత్రలో రీమేక్ మొదలు పెట్టారు.

తెలుగు లో జూన్‌ లో ఈ రీమేక్‌ ను విడుదల చేసే అవకాశం కూడా ఉందంటున్నారు.

ఇలాంటి సమయంలో హిందీ రీమేక్ కు సంబంధించిన అధికారికంగా ప్రకటన వచ్చింది.దృశ్యం 2 హిందీ రైట్స్ ను పనోరమ స్టూడియోస్‌ వారు దక్కించుకున్నారు.

దృశ్యం మొదటి పార్ట్‌ హిందీ వర్షన్ లో అజయ్ దేవగన్ మరియు శ్రియ శరన్‌ లు జంటగా నటించారు.

ఒరిజినల్‌ వర్షన్‌ కు చాలా మార్పులు చేర్పులు చేసి హిందీ దృశ్యం 2 ను తెరకెక్కించం జరిగింది.

హిందీ లో అవే మార్పుల తో దృశ్యం 2 ను కూడా తెరకెక్కిస్తారనే వార్తలు వస్తున్నాయి.

అయితే అజయ్ దేవగన్‌ రీమేక్ లో నటించేందుకు ఓకే చెప్పాడా లేదంటే మరో హీరో ఎవరైనా దృశ్యం 2 ను చేస్తారా అనేది చూడాలి.

అన్ని భాషల్లో కూడా మొదటి పార్ట్‌ హీరో నటిస్తున్న కారణంగా హిందీ లో కూడా ఆయనే నటిస్తాడనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతోంది.

త్వరలోనే దృశ్యం 2 కు సంబంధించిన హిందీ చిత్రీకరణ మొదలు కాబోతుంది.అప్పుడు హీరో గా నటించేది ఎవరు అనే విషయమై క్లారిటీ రాబోతుంది.

మరో వైపు తమిళం దృశ్యం 2 కు సంబంధించిన ఎలాంటి అప్ డేట్ రాలేదు.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!