అమ్మ సమాధి దగ్గరే పంచాయతీ.. పన్నీర్ వర్సెస్ పళని

తమిళనాడులో ఆల్ ఇండియా అన్నాద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే) పార్టీ అధికారం కోల్పోయినా ఆ పార్టీలో కీలక నేతల మధ్య మాత్రం ముసలం ఆగడం లేదు.

ముఖ్యంగా పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాలంటూ ఇరు వర్గాల మద్దతుదారులు డిమాండ్‌ చేస్తున్నారు.

అన్నాడీఎంకే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకరికి పార్టీ పగ్గాలు, మరొకరికి సీఎం పదవి అన్న కోణంలో చెరో పదవిని దక్కించుకున్నారు.

ఇందులో భాగంగా పార్టీ పగ్గాలు పన్నీరు సెల్వంకు, ముఖ్యమంత్రి పదవిని పళనిస్వామికి అప్పగించారు.

అయితే తాజాగా మరోసారి పన్నీర్ సెల్వం, పళని స్వామి వర్గాల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది.

జూన్‌ 14న జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశం నుంచి ఈ ముసలం మరింతగా ముదిరింది.

ఈ తరుణంలో జయలలిత సమాధి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.చెన్నై మెరీనా బీచ్‌లో ఉన్న జయలలిత సమాధి వద్ద కిరోసిన్ పోసుకుని ఓ అన్నాడీఎంకే కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

పళనిస్వామి అన్నాడీఎంకే అధ్యక్షుడిగా ఉండడానికి వీల్లేదంటూ వీరంగం సృష్టించాడు.అన్నాడీఎంకే అధినేతగా జయలలిత పేరే ఉండాలంటూ డిమాండ్ చేశాడు.

దీంతో పోలీసులు ఆ కార్యకర్తను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.గురువారం నాడు అన్నాడీఎంకే కౌన్సిల్ సమావేశం జరగనుంది.

అయితే ఈ సమావేశానికి ముందే పార్టీలో వర్గపోరు బయటపడింది. """/" /ఈరోజు జరగబోయే మీటింగ్‌లో పార్టీ అంతా ఒక్కరి నాయకత్వంలోనే నడవాలని పళనిస్వామి తీర్మానం చేయనున్నారు.

అయితే ఈ సమావేశాన్ని అడ్డుకోవడానికి పన్నీర్ సెల్వం ప్రయత్నిస్తున్నారు.పార్టీ కన్వీనర్‌ను తానేనని .

కాబట్టి తన సంతకం లేకుండా పార్టీ జనరల్ బాడీ ఆ తీర్మానాన్ని ఆమోదించడానికి వీల్లేదని చెబుతున్నారు.

ఈ మేరకు పన్నీర్ సెల్వం వర్గీయులు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.

ఇది అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారం అని.సమావేశాన్ని ఆపాలని తాము ఆదేశించలేమని బెంచ్‌ స్పష్టం చేసింది.

అంతేకాకుండా భేటీకి హాజరయ్యే సభ్యులను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని మద్రాస్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్