థమ్సప్‌తో పానీపూరీ.. లొట్టలేసుకుని తింటున్న మహిళలు
TeluguStop.com
అత్యంత విచిత్రమైన ఆహార ప్రయోగాలను కొందరు చేస్తుంటారు.దానిని తిన్న వాళ్లు చాలా బాగుందని ప్రశంసిస్తుంటారు.
ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో చూసినప్పుడు ఇదెక్కడి విడ్డూరమంటూ ప్రజలు ముక్కున వేలేసుకుంటారు.
అయితే ఫుడ్ అంటే ఇష్టపడేవారు ముఖ్యంగా వెరైటీ ఫుడ్( Variety Food ) కోరుకునే వారికి ఇలాంటివి ప్రత్యేక అనుభూతిని ఇస్తుంటాయి.
ఇదే కోవలో ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
'థమ్స్ అప్ పానీ పూరీ' ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది.ఈ కాంబినేషన్ నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.
కొందరు దీనిని సమర్ధిస్తుంటే, మరికొందరు దీనిని విమర్శిస్తున్నారు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
"""/" /
సోషల్ మీడియాలో పిచ్చిగా వైరల్ అవుతున్న వీడియోలో ఒక మహిళ ఈ 'థమ్స్ అప్ పానీ పూరీ'ని( Thumbs Up Pani Puri ) రియల్ గా ట్రై చేస్తోంది.
అవును, మీరు విన్నది నిజమే! మహమ్మద్ ఫ్యూచర్‌వాలా అనే యూజర్ ట్విట్టర్లో షేర్ చేసిన వైరల్ వీడియోలో ఒక మహిళ ఈ విచిత్రమైన ఫుడ్ ని టేస్ట్ చేసింది.
వీడియోలో ముందుగా థమ్సప్‌ను ఓ గిన్నెలో ఆ విక్రేత పోశాడు.తర్వాత అందులో మసాలా, ఉల్లిపాయలు వేశాడు.
ఆ మిశ్రమంలో పానీపూరిని ముంచి ఓ మహిళకు ఇచ్చాడు.దానిని ఆమె ఆసక్తిగా నోటిలో పెట్టుకుంది.
తిన్న తర్వాత ఆమె అది చాలా బాగుందన్నట్లు రియాక్షన్ ఇచ్చింది.ఆన్లైన్లో షేర్ చేయబడిన తర్వాత వీడియో 8,000 కంటే ఎక్కువ వ్యూస్ దక్కాయి.
ఈ వీడియో చూసిన నెటిజన్లు పూర్తిగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇలా విచిత్రమైన కాంబినేషన్లతో పానీపూరీలు చేసి ప్రజలకు ఏదైనా అయితే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు.
కొంతమంది ట్విట్టర్ వినియోగదారులు ఈ వీడియోను ఆస్వాదించగా, మరికొందరు ఇది బాగోలేదని పెదవి విరిచారు.
ఏదేమైనా ప్రస్తుతం ఈ థమ్సప్ పానీపూరి వీడియో చాలా మందిని ఆకర్షిస్తోంది.
‘కల్కి 2’ ఇండస్ట్రీ హిట్ కొట్టబోతుందా..? నాగ్ అశ్విన్ ప్లాన్ ఏంటి..?