కంటి చూపు లోపిస్తుందా..అయితే పన్నీర్ తినాల్సిందే!
TeluguStop.com
కంటి చూపు లోపించడం ఈ మధ్య కాలంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలా మందిలో కనిపిస్తున్న సమస్య ఇది.
పోషకాల లోపం, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, స్మోకింగ్, మద్యపానం, ల్యాప్టాప్స్ మీద గంటల తరబడి వర్క్ చేయడం, మొబైల్ ఫోన్స్ స్క్రీన్స్ చూస్తూ ఉండడం ఇలా రకరకాల కారణాల వల్ల కంటి చూపు మందగిస్తూ ఉంటుంది.
దీంతో మందులు వాడటం, స్పెట్స్ వేయించుకోవడం చేస్తుంటారు.అయితే కంటి చూపును మెరుగు పరచడంలో కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.
అలాంటి వాటిలో పన్నీర్ కూడా ఒకటి.పాల ద్వారా వచ్చే పన్నీర్లోనూ బోలెడన్ని పోషకాలు ఉంటాయి.
విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో పోషక విలువలు పన్నీర్ ద్వారా లభిస్తాయి.
అందుకే వారానికి రెండు సార్లు అయినా పన్నీర్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.
ముఖ్యంగా కంటి సంబంధిత సమస్యలతో బాధ పడే వారు పన్నీర్‌ను డైట్లో చేర్చుకుంటే చాలా మంచిది.
"""/" /
పన్నీర్లో ఉండే కొన్ని ముఖ్య పోషకాలు రేచీకటి సమస్యను దూరం చేస్తుంది.
అలాగే కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.దాంతో కంటి చూపు కూడా పెరుగుతుంది.
అయితే బరువు పెరిగిపోతామన్న భయంతో చాలా మంది పన్నీర్‌ను ఎవైడ్ చేస్తుంటారు.కానీ, పన్నీర్‌ను మితంగా తీసుకుంటే.
బరువు పెరగనే పెరగరు.కాబట్టి, ఎలాంటి భయం లేకుండా పన్నీర్ తీసుకోవచ్చు.
పిల్లలకూ పెట్టొచ్చు.పైగా పన్నీర్‌ను డైట్లో చేర్చుకోవడం వల్ల అందులో పుష్కలంగా ఉండే జింక్ శరీర రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేస్తుంది.మరియు జీర్ణ వ్యవస్థ పని తీరును కూడా పెంచుతుంది.
అలాగే పన్నీర్ తీసుకోవడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు దూరం అవుతాయి.
ఎముకలు, దంతాలు ధృఢంగా మారతాయి.
పుష్ప ది రూల్ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. బొమ్మ బ్లాక్ బస్టర్ కావడం మాత్రం పక్కా!