పెళ్లిలో పంతులు చేతివాటం.. అసలుకే ఎసరు!
TeluguStop.com
ఒక పెళ్లిలో సాధారణంగా పెళ్లికొడుకు, పెళ్లి కూతురు తరఫు వారి సందడి మనం నిత్యం చూస్తుంటాం.
ఇక పెళ్లి మండపంలో పెళ్లికొడుకు, పెళ్లికూతురుతో పాటు మనకు కనిపించే మరో వ్యక్తి పురోహితుడు.
పురోహితుడు లేకుండా పెళ్లిళ్లు జరగవు.ఇది అందరికీ తెలిసిన నిజం.
అయితే వారు వేద మంత్రాల మధ్య ఓ జంటను ఒకటి చేసే పుణ్య కార్యం చేస్తారని, వారి ఆశీస్సులు తీసుకుంటే మంచిదని అంటుంటారు.
కానీ ఓ పెళ్లి వేడుకలో ఒక పురోహితుడు చేసిన పనికి అక్కడున్న వారు నోరెళ్లబెట్టారు.
తేరుకుని చూస్తే అసలుకే ఎసరు పెట్టాడని తెలుసుకున్నారు.మెదక్ జిల్లాలోని తూప్రాన్‌లో ఓ జంట పెళ్లి చేసుకున్నారు.
కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య అంగరంగ వైభవంగా ఈ పెళ్లి వేడుకు జరుగుతుంది.
పురోహితుడు పెళ్లివేడుకలో వేదమంత్రాలు జపిస్తూ ఆ పెళ్లిని మరింత వేడుకగా జరిపిస్తున్నాడు.అయితే వధువుకు పెట్టే పుస్తెలతాడు మాయం కావడంతో అక్కడున్నవారు అందరూ అవాక్కయ్యారు.
కాగా బంగారు పుస్తెలతాడును ఆ పురోహితుడే కాజేశాడు.మంత్రాలు చదువుతూ మధ్యలోనే ఆ గొలుసును మాయం చేశాడు ఈ ఘనాపాటి.
అయితే దీనికి సంబంధించిన వీడియోను బంధువులు పరిశీలించగా, పురోహితుడు ఆ గొలుసును దాచిపెట్టుకున్న సంగతి బట్టబయలైంది.
దీంతో ఆ గొలుసు కోసం సదరు పురోహితుడి ఇంటికి వెళ్లగా, ఆయన ఇంటికి వచ్చి మూడు రోజులయ్యిందని అక్కడున్న వారు తెలిపారు.
చేసేదేమీ లేక బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పెళ్లి చేసి అక్షింతలు వేసి దీవించాల్సిన పురోహితుడు, ఇలా మంగలసూత్రాన్ని మాయం చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం ఆ పురోహితుడి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు.ఏదేమైనా తాళికొట్టేసిన పురోహితుడి కోసం బాధితులు కూడా వెతుకుతున్నారు.
మరి ఆ పురోహితుడు ఎప్పటికి దొరుకుతాడో, దొరికితే ఆయన ఎలాంటి సమాధానం చెబుతాడో చూడాలి.
ఓరి మీ దుంపతెగ.. అంత్యక్రియల్లో నవ్వులు, డ్యాన్సులేంట్రా.. (వీడియో)