పల్లె నిద్రలో పంచాయతీ అధికారి

సూర్యాపేట జిల్లా:5 వ,విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి మఠంపల్లి మండలంలోని పెదవీడు గ్రామ పంచాయతీలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు.

గ్రామ సర్పంచ్ బిబికూతుబ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధిలుగా సూర్యాపేట జిల్లా పంచాయితీ అధికారి ఎన్.

యాదయ్య,ఎంపీపీ మూడవత్ పార్వతికొండానాయక్,జెడ్పీటీసీ బాణోతు జగన్ నాయక్,ఎంపిడిఓ జానికి రాములు,ఎంపిఓ అంజనేయులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించిందని,గ్రామీణప్రాంతాల్లో ప్రజా సమస్యలు సత్వర పరిష్కారం కోసమే పల్లె నిద్ర కార్యక్రమని తెలిపారు.

వెనుకబడిన పల్లెలను అన్ని గ్రామాలతో సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని కోరారు.

ముందుగా గ్రామంలో ఇంటింటికి పాదయాత్రగా తిరుగుతూ ప్రజల సమస్యలపై ఆరా తీశారు.రైతు బంధు,పింఛన్లు, కళ్యాణలక్ష్మి,షాదీముభారక్ పధకాలు అందరికి వస్తున్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం గ్రామ వాసులతో కలిసి సహపంక్తి భోజనాలు చేసి,పల్లె నిద్రలో భాగంగా గ్రామ పంచాయతీలో పల్లె నిద్ర చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మూడవత్ కొండానాయక్,మండల ఉపాధి హామీ ఎపిఓ ఉమా,కార్యదర్శి లక్ష్మణ్,వార్డు సభ్యులు,ఆశా వర్కర్లు,అంగన్వాడీ టీచర్లు,గ్రామ పంచాయతీ సిబ్బంది,ప్రజలు పాల్గొన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై1, సోమవారం 2024