బండకాడపల్లి నివాసి మురళి ఇంటిలో దర్శనమిచ్చిన అమ్మవారి పంచలోహ విగ్రహం....
TeluguStop.com
తిరుపతి: బండకాడపల్లి నివాసి అయిన మురళి ఇంటిలో దర్శనమిచ్చిన అమ్మవారి పంచలోహ విగ్రహం.
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామలచెరువు పంచాయతీ బండకాడపల్లిలో నివాసముండే గుర్రప్ప కుమారుడు మురళికి మంగళవారం అర్ధరాత్రి నిద్రించి ఉండగా ఇంటిలో శబ్దం రావడంతో అమ్మవారు ఒడ్లమూట నుంచి ప్రత్యక్షమై దర్శనమిచ్చింది.
ఈ సందర్భంగా గ్రామస్తులు గుర్రప్ప, గీత, చిన్నక్క మాట్లాడుతూ అమ్మవారు మంగళవారం అర్ధరాత్రి మురళికి ప్రత్యక్షమైందని ,ఈ గ్రామంలోనే గుడి కట్టి,అమ్మవారిని ప్రతిష్టించి,ప్రతినిత్యం పూజలు చేసుకోవాలని,అలా చేస్తే గ్రామంలోని ప్రజలను చల్లగా కాపాడతానని చెప్పిందని తెలిపారు.
ఈ పంచలోహ అమ్మవారి విగ్రహం మురళి ఇంటిలో దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు.
అమ్మవారి పంచలోహ విగ్రహం సుమారు ఒక అడుగు ఎత్తు, రెండు కిలోల బరువు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అమ్మవారి గుడి కట్టడానికి ప్రభుత్వం వారు ప్రజల సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నామని అన్నారు.
చుట్టుప్రక్కల గ్రామస్తులు అమ్మవారిని చూడడానికి అధిక సంఖ్యలో వస్తున్నారని తెలిపారు.
వారసుడి సినీ ఎంట్రీ గురించి వెంకీమామ క్లారిటీ ఇదే.. అప్పుడే ఎంట్రీ ఇవ్వనున్నారా?