వైసీపీకి ‘ పంచకర్ల ‘ రాజీనామా ! అసలు కారణం ఇదే ?

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడేకొద్దీ, ఆ పార్టీలోని అసంతృప్తులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.

చాలా కాలంగా గ్రూపు రాజకీయాలు వైసీపీలో సర్వసాధారణంగా మారిపోయాయి.ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది.

కొంతమంది ఈ గ్రూపు రాజకీయాల కారణంగా పార్టీకి దూరమవుతుండగా, మరికొంతమంది వచ్చే ఎన్నికల్లో తమకు టిక్కెట్ దక్కే అవకాశం లేదనే అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేస్తున్నారు.

తాజాగా విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు( Panchakarla Ramesh Babu ) వైసీపీకి రాజీనామా చేశారు.

తన రాజీనామా విషయాన్ని మీడియా సమావేశం నిర్వహించి మరీ ప్రకటించారు.ఈ సందర్భంగా తన రాజీనామాకు కారణాలు ఏమిటనేది పంచకర్ల రమేష్ బాబు వివరించారు.

"""/" / పార్టీ అధికారంలో ఉన్నా, కార్యకర్తలకు సరైన న్యాయం చేయలేకపోయాను అని, క్షమించాలి అంటూ రమేష్ బాబు వేడుకున్నారు.

జిల్లా, పార్టీ అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ,ఇలా చేస్తున్నందుకు బాధగా ఉందని రమేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ఏడాదికారంగా ఎన్నో సమస్యలు జగన్( CM Jagan ) దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశానని , కానీ వీలు కాలేదని అన్నారు.

ప్రజా సమస్యలు కిందిస్థాయిలో తీర్చలేనప్పుడు ఈ పదవిలో ఉండడం కరెక్ట్ కాదనే అభిప్రాయంతోనే రాజీనామా చేస్తున్నానని, త్వరలో తన అనుచరులతో సమావేశమై తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని పంచకర్ల తెలిపారు.

అయితే వచ్చే ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని రమేష్ బాబు ప్లాన్ చేసుకున్నారు.

"""/" / టికెట్ తనకే వస్తుందనే ఆశ పెట్టుకున్నారు అయితే టిక్కెట్ హామీ దక్కకపోవడంతో పంచకర్ల అసంతృప్తికి గురైనట్లు సమాచారం.

అయితే చాలాకాలంగా వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి వైవి సుబ్బారెడ్డి తో రమేష్ బాబుకు విభేదాలు ఉన్నాయని, ఆ కారణంతోనే రాజీనామా చేస్తున్నట్లుగా ప్రచారం జరిగినా, దీనిపై రమేష్ బాబు క్లారిటీ ఇచ్చారు.

తనకు సుబ్బారెడ్డి తో ఎటువంటి విభేదాలు లేవని ప్రకటించారు.ఇక రమేష్ బాబు పొలిటికల్ జర్నీ ఒకసారి పరిశీలిస్తే .

ఆయన 2009 ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.ఆ పార్టీ నుంచి పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఆ తర్వాత ప్రజారాజ్యం ను కాంగ్రెస్ లో విలీనం చేయడంతో కాంగ్రెస్ లోనే కొనసాగారు.

ఏపీ ,తెలంగాణ విభజన సమయంలో కాంగ్రెస్ కు రాజీనామా చేసి 2019లో గంటా శ్రీనివాసరావు( Ganta Srinivasa Rao ), అవంతి శ్రీనివాస్ తో పాటు రమేష్ బాబు టిడిపిలో చేరారు.

2014 ఎన్నికల్లో టిడిపి తరఫున యలమంచిలి నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

ఆగస్టు 2020లో టిడిపికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేయడంతో ఏ పార్టీలో పంచకర్ల రమేష్ బాబు చేరబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

మోక్షజ్ఞ దిగనంత వరకే.. మోక్షజ్ఞ ఇప్పటికే స్టార్ హీరో.. బాలయ్య కామెంట్స్ వైరల్!