'కాంతార'కు ప్రభాస్ రివ్యూ.. సెకండ్ టైమ్ చూశాను అంటూ?

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సాధారణంగా ఏదైనా సినిమాను చూసి దాని రివ్యూ చెప్పడం అన్నది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.

అలాంటిది తాజాగా ప్రభాస్ కన్నడ మూవీ కాంతార పై ప్రశంసలు కురిపించారు.అంతేకాకుండా రెండు సార్లు ఆ సినిమాని చూశానట్లు తెలిపారు ప్రభాస్.

ఈ మేరకు ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఆ విషయాన్ని తెలియజేస్తూ ప్రశంసలు కురిపించారు.

కాంతార సినిమాని రెండో సారి చూశాను.అద్భుతమైన అనుభూతినిచ్చింది.

గొప్ప కథ, థ్రిల్లింగ్‌ క్లైమాక్స్.కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన చిత్రమిది అని పేర్కొన్నారు ప్రభాస్.

ఇప్పటికీ ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించడంతో ఆ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఇకపోతే ఇప్పటికే కన్నడలో విడుదలైన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది.

అయితే కన్నడ మార్కెట్‌ తక్కువగా ఉన్న నేపథ్యంలో అంతగా ప్రచారం జరగలేదు.ఇటీవల ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

తెలుగులో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌ తన గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసేందుకు సిద్దమయ్యారు.

తెలుగులో నేడు అనగా అక్టోబర్ 15 న ఈ సినిమాని విడుదల చేయనున్నారు.

"""/"/ ఇప్పటికీ కన్నడ ఇండస్ట్రీలో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో తెలుగులో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

అంతేకాకుండా హీరో ప్రభాస్ సైతం ఈ సినిమాను రెండుసార్లు చూసి మరి ఈ సినిమాపై పొగడ్తల వర్షం కురిపించారు అంటే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

అంతేకాకుండా ప్రభాస్ ఈ సినిమాకు రివ్యూ ఇవ్వడం అన్నది సపోర్ట్ చేయడంతో పాటు ప్రమోషన్ పరంగా మరింత కలిసి వచ్చే అంశం అని చెప్పవచ్చు.

ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాని నిర్మిస్తున్న హోంబలే ప్రొడక్షన్ ఈ కాంతారా సినిమాను నిర్మించడంతో ప్రభాస్ ఇందులో భాగమయ్యారు ఈ చిత్రాన్ని రిషబ్‌ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించారు.

ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్… ఎమోషనల్ అయిన ఫ్యామిలీ మెంబర్స్…