ప్రభాస్ ఫౌజీ సినిమాలో నటించనున్న పాన్ ఇండియా స్టార్ హీరో..
TeluguStop.com
బాహుబలి సినిమాతో ప్రభాస్( Prabhas ) పాన్ ఇండియా స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు.
ఇక ఇప్పుడు ఆయన హను రాఘవపూడి( Hanu Raghavapudi ) డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక మొత్తానికైతే ఈ ప్రాజెక్టు చాలా తక్కువ సమయంలోనే సెట్స్ మీదికి వెళ్లే విధంగా ప్రణాళికను రూపొందిస్తున్నారు.
ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో అయిన యశ్( Yash ) కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడు అనే వార్తలైతే పుష్కలంగా వినిపిస్తున్నాయి.
"""/" /
మరి ఆయన ఈ సినిమాలో ఎలాంటి పాత్రను పోషించబోతున్నాడు అనేది కూడా ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకేత్తిస్తుంది.
ఇక హను రాఘవపూడి గత చిత్రం అయిన ' సీతా రామం'( Sitaramam ) సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా తెచ్చుకున్నాడు.
ఇక ఈ సినిమాలో కూడా ఆయన ప్రభాస్ యొక్క స్టామినా ను వాడుకొని ఒక భారీ లవ్ స్టోరీని తెరకెక్కించాలని చూస్తున్నాడు.
"""/" /
తను అనుకున్నట్టుగానే ఈ సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.
ఇక ఇంతకుముందు ప్రభాస్ చేసిన సలార్, కల్కి లాంటి సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ప్రభాస్ కి ఒక మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చాయి.
మరి అలాంటి ప్రభాస్ కెరియర్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమాలు మంచి క్రేజ్ ను తీసుకురావడమే కాకుండా ఆయనను ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేస్తున్నాయి.
భారతీయ పాటకు దీపావళి వేళ అద్భుతమైన డ్యాన్స్ తో అదరగొట్టిన అమెరికన్ అంబాసిడర్