Star Heroes: స్టార్ హీరోలకు చుక్కలు చూపిస్తున్న పాన్ ఇండియా స్టేటస్.. ఫ్లాప్ వస్తే పరువు గోవింద!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది.దాంతో చిన్న హీరోల నుంచి ఈ పెద్ద హీరోల వరకు ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించాలని ఆసక్తిని చూపిస్తున్నారు.

ఇప్పటికే టాలీవుడ్ ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ( Prabhas, Allu Arjun, Ram Charan, NTR )లాంటి హీరోలు పాన్ ఇండియా హీరోలుగా మారిన విషయం తెలిసిందే.

పాన్ ఇండియా సినిమాల వల్ల టాలీవుడ్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.వందల కోట్ల కలెక్షన్స్ ని కళ్లప్పగించి చూస్తున్నారు.

హీరోలని తోపు తురుము అని అంటూ ఫ్యాన్స్ భుజాలేగరేస్తున్నారు. """/" / కానీ పాన్ ఇండియా అనే ట్యాగ్ వల్ల మన హీరోలు ఎన్ని‍ కష్టాలు పడుతున‍్నారో తెలుసా?అదేంటి అనుకుంటున్నారా.

అవునండోయ్ ఈ పాన్ ఇండియాల వల్ల మన హీరోలు ఫుల్ గా కష్టపడాల్సి వస్తోంది.

మొదట బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ మొదలైంది.

ఎ‍ప్పుడైతే రాజమౌళి బాహుబలి తీసి, వందల కోట్లు వసూళ్ల రుచి చూపించాడో టాలీవుడ్ పేరు మార్మోగిపోయింది.

ఆ తర్వాత పలువురు దర్శకులు ఆ దిశగా ప్రయత్నాలు చేసినప్పటికీ పుష్ప, ఆర్ఆర్ఆర్( Pushpa , Rrr ) లాంటివి మాత్రం అదిరిపోయే రేంజు విజయాలు అందుకున్నాయి.

మరి ఈ పాన్ ఇండియా వల్ల కలిగే కష్టాలు ఏంటి అన్న విషయానికి వస్తే.

"""/" / పాన్ ఇండియా సినిమాలు టాలీవుడ్ క్రేజుని ఎక్కడికో తీసుకెళ్తున్నాయని మనం సంబరపడిపోతున్నాము.

కానీ మంచితో పాటు చెడు ఉన్నట్లు క్రేజ్ తోపాటు ఇవి కొత్త కష్టాల్ని తీసుకొస్తున్నాయి.

ఎందుకంటే ఒకసారి పాన్ ఇండియా స్టార్ అనే ట్యాగ్ వచ్చి చేరితో సదరు హీరోలు భూమ్మీద నిలబడరు.

కాదు కాదు అభిమానులు ఆ అవకాశం ఇవ్వరు.అంచనాలు పెంచేసుకుంటారు.

ఇలా ఒకటి రెండు కాదు చాలానే సమస్యలు మన పాన్ ఇండియా హీరోలకు ఎదురవుతున్నాయి.

పాన్ ఇండియా సినిమాలు చేయడం చాలా సులభమేమోనని అందరూ అనుకుంటారు.కానీ అది చాలా అంటే చాలా కష్టమైన విషయం.

పాన్ ఇండియా సబ్జెక్ట్ ని డీల్ చేయగలిగే దర్శకుడు దొరకాలి.అందుకు తగ్గ స్టోరీ సెట్ కావాలి.

ఆ కథ దేశవ్యాప్తంగా అందరు ప్రేక్షకులకు నచ్చేలా ఉండాలి.మళ్లీ అలాంటి సినిమాకు చిన్న బడ్జెట్ లు సరిపోవు.

కొన్నిసార్లు స్టోరీ సింపుల్ గా ఉన్నాసరే భారీతనం ఎక్కువుండాలనే ఆరాటంతో చాలా సినిమాలు బోల్తా కొట్టేస్తున్నాయి.

ఈ వరాహం సాక్షాత్తు విష్ణువు రూపమేనా.. ఆనందంగా పాలిచ్చిన గోమాత..?