ప్రభాస్ లేకుండానే.. 'ఆదిపురుష్‌' పుకార్లకు చెక్‌ పెట్టిన ఓమ్‌ రౌత్‌

కరోనా సెకండ్‌ వేవ్‌ కు ముందు ఆదిపురుష్‌ షూటింగ్ ను హైదరాబాద్‌ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

హైదరాబాద్‌ షెడ్యూల్‌ ను దాదాపుగా మూడు నెలల పాటు కొనసాగించబోతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి.

ప్రభాస్ మూడు నెలల షెడ్యూల్‌ లో 50 రోజుల వరకు ఆ సినిమా యూనిట్‌ సభ్యులతో ఉంటాడని.

ఆ సమయంలో ఆది పురుష్‌ కు సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత ప్రభాస్ ఆదిపురుష్‌ కాకుండా మరో సినిమాను మొదలు పెట్టాడు.

ఆ సినిమా షూటింగ్‌ విషయంలో పుకార్లు షికార్లు చేశాయి.ప్రభాస్ వేరే సినిమాను చేస్తున్న కారణంగా ఆది పురుష్‌ ను మొదలు పెట్టలేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఆ కామెంట్స్ కు దర్శకుడు ఓమ్‌ రౌత్‌ క్లారిటీ ఇచ్చాడు.నేడు ఓమ్‌ రౌత్‌ ఇన్ స్టా గ్రామ్ లో తాను ఆది పురుష్‌ షూటింగ్ ను పునః ప్రారంభించినట్లుగా చెప్పు కొచ్చాడు.

అయితే ప్రస్తుత జరుగుతున్న షెడ్యూల్ లో ప్రభాస్ లేకుండా జరుగుతుందని కూడా ఆయన అన్నాడు.

ఆదిపురుష్‌ షూటింగ్ లో ప్రభాస్‌ జాయిన్ అయ్యేది ఎప్పుడు అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న రాధే శ్యామ్‌ మరియు సలార్ షూటింగ్‌ లు సమాంతరం గా జరుగుతున్నాయి.

"""/"/ రెండు మూడు వారాల్లో రాధే శ్యామ్‌ సినిమా షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టబోతున్నారు.

ఆ తర్వాత సలార్‌ మరియు ఆదిపురుష్‌ ల షూటింగ్ లతో ప్రభాస్ బిజీ అవ్వబోతున్నాడు.

ఆదిపురుష్‌ కోసం మరో రెండు మూడు నెలల డేట్లను ఆయన కేటాయించాల్సి ఉంటుందని బాలీవుడ్‌ వర్గాల టాక్‌.

సలార్‌ కు మాత్రం 50 రోజుల డేట్ల తో ముగించే అవకాశం ఉందంటున్నారు.

అడవిలో ఊహించని ఘోరం.. తండ్రీకొడుకులను చంపేసిన ఎలుగుబంటి.. షాకింగ్ వీడియో వైరల్!