పాంప్లెట్ రాజకీయం : ‘ జగనన్న ముద్దు .. రక్షణ నిధి వద్దు ‘ !
TeluguStop.com
'జగనన్న ముద్దు రక్షణ నిధి వద్దు' అంటూ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధి కి( MLA Rakshana Nidhi ) వ్యతిరేకంగా వెలసిన కరపత్రాలు కలకలం రేపుతున్నాయి.
చాలాకాలంగా ఈ నియోజకవర్గ వైసీపీలో గ్రూపు రాజకీయాలు ఉన్నాయి.ఈ మధ్యకాలంలో అవి తారస్థాయికి వెళ్ళాయి.
ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కరపత్రాలు పంపిణీ కావడం కలకలం సృష్టిస్తున్నాయి.గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముగింపు సమయంలో ఎమ్మెల్యే రక్షణ నిధిని మళ్లీ గెలిపించాలని కోరుతూ కొంతమంది నేతలు ఎమ్మెల్యే పై పొగడ్తల వర్షం కురిపించారు.
వచ్చే ఎన్నికల్లోనూ రక్షణ నిధిని గెలిపించాలని తమ ప్రసంగంలో కొంతమంది నాయకులు వ్యాఖ్యానించారు.
పాత కక్షలు ఉంటే పక్కన పెట్టాలని పిలుపునిచ్చారు.ఆ సభ అనంతరం కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కరపత్రాలు ముద్రించి పంచడం కలకలం రేపుతోంది.
ముఖ్యంగా తిరువూరు నగర పంచాయతీ పాలకవర్గం చైర్మన్ ని మార్చే విషయంలో వైసీపీ పాలకవర్గ సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయారు.
చైర్మన్ మార్పు విషయంలో పార్టీలలో అంతర్గత విభేదాలు ఎప్పుడో బయటపడ్డాయి. """/" /
తాజాగా మరోసారి కరపత్రాలు రూపంలో ఆ గ్రూపు రాజకీయాలు( Group Politics ) బయటపడ్డాయి.
ఎమ్మెల్యే రక్షణ నిధి మాకు వద్దు వద్దు అంటూ కరపత్రాలు కనిపించడంతో వీటికి కారణం ఎవరు అనేది వైసిపి ( YCP ) ముఖ్య నాయకులు ఆరా తీసే పనిలో పడ్డారు.
వైసిపి లోని ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం వారు దీనికి పాల్పడ్డారా లేక ప్రతిపక్ష పార్టీలు వైసీపీలో కలకలం సృష్టించేందుకు ఈ కరపత్రాలను ముద్రించి కలకలం రేపే ప్రయత్నం చేస్తున్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
"""/" /
తిరువూరు( Tiruvuru ) పట్టణంలో జగనన్న ముద్దు.రక్షణ నిధి వొద్దు అంటూ కరపత్రాలు వెలుగుచూడడంతో, జనాలలోను చర్చ మొదలైంది.
వైసిపి నాయకుల ఇళ్ల ముందు, వైసిపి ఆఫీసు ముందు, షాపుల ముందు పెద్ద ఎత్తున కరపత్రాలు కనిపించడంతో, అంతా షాక్ కి గురయ్యారు.
ఇప్పటికే తిరువూరు వైసీపీలో వర్గ విభేదాలు తీవ్ర స్థాయికి వెళ్ళాయి.ఈ నేపథ్యంలో పార్టీలోని ఎమ్మెల్యే వ్యతిరేకవర్గంపైనే అందరిలోనూ అనుమానాలు కలుగుతున్నాయి.
మోక్షజ్ఞకు ప్రశాంత్ వర్మ హిట్ ఇవ్వగలడా.. ఆ ఫ్లాప్ చూసి టెన్షన్ మొదలైందిగా!