ఏపీలో ఎవరిది రౌడీ రాజకీయం.. కారంపూడిలో టీడీపీ నేతల తీరు ఇంత ఘోరమా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగి 13 రోజులు అవుతోంది.మరో 10 రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

మాచర్లలో పిన్నెల్లి ( Pinnelli )ఈవీఎం ధ్వంసం చేశారని కామెంట్లు చేస్తున్న కూటమి నేతలు రీ పోలింగ్ కు ఎందుకు డిమాండ్ చేయడం లేదనే ప్రశ్నకు మాత్రం వాళ్ల నుంచి సమాధానం లేదు.

ఏపీలో ఎక్కడ ఏ ఘటన జరిగినా పులివెందుల రౌడీలు, కడప వ్యక్తులు చేశారంటూ టీడీపీ( TDP ) నేతలు ఆరోపణలు చేస్తుంటారు.

అయితే పల్నాడు జిల్లా కారంపూడిలో ( Karampudi Of Palnadu District )ఎన్నికలు పూర్తైన తర్వాత వైసీపీ కార్యకర్తలకు( YCP Workers ) చెందిన షాపులపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్న వీడియోలు, షాపులను దహనం చేస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ వీడియోలను చూపిస్తూ ఏపీలో ఎవరిది రౌడీ రాజకీయం అంటూ వైసీపీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

కారంపూడిలో టీడీపీ నేతల తీరు ఇంత ఘోరమా? అంటూ అభిప్రాయపడుతున్నారు. """/" / పోలింగ్ ముందురోజు వరకు ప్రశాంతంగా ఉన్న ఏపీలో పోలింగ్ రోజులే ఘర్షణలు చోటు చేసుకోవడానికి కారణమేంటని వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లోనే ప్రధానంగా ఈ ఘర్షణలు చోటు చేసుకున్నాయనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

ఎన్నికల్లో గెలుపు కోసం ఎంత దారుణంగా అయినా ప్రవర్తిస్తారా? రాజకీయాల కోసం అమాయకుల ప్రాణాలను బలి చేస్తారా? అంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

"""/" / ఆటవికమా? ప్రజాస్వామ్యమా? అంటూ జరిగిన దాడుల వీడియోలను చూసి సామాన్య ప్రజలు సైతం తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

షాపులను ధ్వంసం చేసి దహనం చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

వైసీపీ నేతలపై ఇష్టానుసారం కామెంట్లు చేసే చంద్రబాబు, పవన్ ఈ దాడుల గురించి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

ఇలాంటి ఘటనల వల్ల ఏపీ ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

దానికి మించిన పాఠం మరొకటి ఉండదు.. రితికా సింగ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!