తేగలను ఇలా తీసుకుంటే..ఇట్టే బరువు తగ్గుతారట!
TeluguStop.com
తేగలు వీటి గురించి పరిచయాలు అవసరం లేదు.తాటి పండు నుంచి లభించే ఉత్పత్తుల్లో తేగలు ఒకటి.
రోడ్లపై ఎక్కడ చూసినా తేగలు విరి విరిగా కనిపిస్తుంటాయి.కొందరు తేగలను ఎంతో ఇష్టంగా తింటుంటారు.
మరికొందరు మాత్రం తేగలను పెద్దగా పట్టించుకోరు.కానీ, తేగల్లో ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి.
విటమిన్ బి, విటమిన్ సి, క్యాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా బోలెడన్ని పోషకాలు తేగల ద్వారా లభిస్తాయి.
అందుకే తేగలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతుంటారు.ముఖ్యంగా అధిక బరువుతో బాధ పడే వారికి తేగలు అద్భుతంగా సహాయపడతాయి.
అవును, బరువు తగ్గించడంలో తేగలు ఉపయోగపడతాయి.మరి తేగలను ఎలా తీసుకోవాలి ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారు అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
"""/" /
తేగలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండ బెట్టి పిండి చేసుకోవాలి.
ఈ పిండితో రొట్టెలు తయారు చేసుకుని తీసుకోవాలి.ఇలా చేయడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు.
అతి ఆకలి కూడా తగ్గు ముఖం పడుతుంది.తేగలను మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
తేగలను తరచూ తీసుకుంటే శరీర రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.అలాగే తేగలు తీసుకోవడం వల్ల వేడి తగ్గి శరీరం చల్లబడుతుంది.
రక్త హీనతను నివారించడంలోనూ తేగలు గ్రేట్‌గా సమాయపడతాయి.పాలలో తేగలను ఉడికించి మిక్సీ పట్టుకోవాలి.
ఆ తర్వాత అందులో బెల్లం కలిపి తీసుకుంటే శరీరానికి పుష్కలంగా ఐరన్ లభిస్తుంది.
దాంతో రక్త హీనత దూరం అవుతుంది.ఇక తేగలను తీసుకుంటే మలబద్ధకం సమస్య కూడా ఉండదు.
అయితే తేగలను రోజుకు ఒకటి మించి తీసుకోరాదు.అతిగా తీసుకుంటే అనేక సమస్యలు ఏర్పడతాయి.
ఆరెంజ్ పండ్లతో కలిపి వీటిని పొరపాటున కూడా తీసుకోకూడదు..తెలుసా?