క్యాన్సర్ నుంచి కాపాడే తాటి ముంజలు.. ఏలా అంటే?
TeluguStop.com
ఎండాకాలంలో చల్లదనం కోసం ఏవైనా పదార్థాలు, పానీయాలు తరచుగా తీసుకోవడం వల్ల ఎండ వేడి నుండి కాస్త ఉపశమనం పొందవచ్చు.
అలా ఎన్నో పండ్ల పదార్థాలు ఉంటాయి.అంతేకాకుండా చలువ నిచ్చే మరో తినే పదార్థం తాటి ముంజలు.
ఇవి ఎండాకాలంలో మాత్రమే దొరుకుతాయి.తాటి చెట్టు నుండి ఈ ముంజలు తయారవుతాయి.
వీటిలో ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి.ఇది శరీర భాగానికి చాలా ముఖ్యమైనవి.
వయసు తేడా లేకుండా ఈ ముంజలు ఇష్టపడే చాలా మంది ఉంటారు.ఇవి తీసుకోవడం వల్ల శరీరంలో వేడి నుండి ఉపశమనం కలుగుతుంది.
ఇవి బాగా పనిచేస్తాయి.ఇందులో ఎ, బి, సి, ఐరన్, జింక్ ,ఫాస్ఫరస్, పొటాషియం విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.
ఇవి తినడం వల్ల శరీరంలో చెడు పదార్థాలు అన్ని తొలగిపోతాయి.అంతేకాకుండా జీర్ణక్రియ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.
"""/" /
ఇక ఇందులో మంచి పోషకాలు ఉండటం వల్ల అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు దూరమవుతాయి.
అంతేకాకుండా డీహైడ్రేషన్ నుండి కాపాడే శక్తి కలిగి ఉంటుంది.శరీరంలో ఉన్న చెడు కొవ్వును తొలగిస్తుంది.
ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్ కు మంచి మేలు చేస్తుంది.రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
గుండెకి మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది.మహిళల్లో రొమ్ము క్యాన్సర్ నివారణకు బాగా సహాయపడుతుంది.
అంతేకాకుండా చికెన్పాక్స్ ని నివారిస్తుంది.అంతేకాకుండా శరీర బరువు ను తగ్గిస్తుంది.
శరీరంలో నీటి శాతాన్ని పెంచుతుంది.ఈ నీటిని చిన్నపిల్లలు తాగడం వల్ల వారికి మంచి ఉపశమనం కలుగుతుంది.
ఎండాకాలంలో దొరికే ఈ తాటి ముంజలు ఆరోగ్యానికి బాగా పనిచేస్తాయి కాబట్టి వీటిని తప్పనిసరిగా తీసుకోవాలి.
అంతేకాకుండా తాటి ముంజ ముదిరి తాటి పండు గా మారుతుంది.
దేవర సీక్వెల్ కు ఇప్పట్లో ఛాన్స్ లేదా.. ఎన్టీఆర్ లైనప్ విషయంలో పూర్తి క్లారిటీ వచ్చేసిందా?