పల్లెల్లో కనిపించని పల్లె వెలుగు బస్సు..!

నల్లగొండ జిల్లా: పల్లెల్లో నివసించే ప్రజల రవాణా సౌకర్యం కోసం పల్లె వెలుగు బస్సులు నడిచేవి.

రాష్ట్ర ప్రభుత్వం పల్లె వెలుగు పేరుతో ఆర్టీసీ బస్సులను పల్లెల్లో ప్రవేశపెట్టింది.కానీ, అవి ఇప్పుడు కనిపించడం లేదు.

కేవలం పట్టణానికి పరిమితం కావడంతో పల్లెల్లో రవాణా అస్తవ్యస్తంగా మారిందని గ్రామీణ విద్యార్థులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో హాలియా నుంచి వద్దిపట్ల నుంచి బస్సు సౌకర్యం ఉండేదని ఈ సర్వీస్ ఆర్టీసీ వారు తీసివేయడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఏళ్ల తరబడిగా పాలకుల నిర్లక్ష్యం ఆ గ్రామాల ప్రజలకు శాపంగా పరిణమించింది.పాలకులు పట్టించుకోకపోవడంతో పెద్దవూర మండలం పీఏపల్లి మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న గ్రామాలకు ఏళ్ల తరబడిగా పల్లె వెలుగు గాలి సోకడం లేదు.

దీంతో ఆ గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఆటోలతో పాటు ఇతర ప్రైవేటు వాహనాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ఈ గ్రామాల మహిళలకు అందని ద్రాక్షే అవుతుంది.

ఇదిలా ఉండగా ఉచిత ప్రయాణం దేవుడెరుగు కనీసం తమ గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని ఆ ఆరు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

నూతనంగా ఎన్నికైన నాగార్జునసాగర్, దేవరకొండ ఎమ్మెల్యేలు ఆ మండలంలో బస్సు సౌకర్యం లేని గ్రామాలను పరిశీలించి పల్లెల్లో పల్లె వెలుగు బస్సులు నడిపే విధంగా కృషి చేయాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.

దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం పూర్తిస్థాయిలో అందే విధంగా చూడాలని పులిచెర్ల,వద్దిపట్ల,ఊట్లపల్లి,కేకే తండా,పర్వేదుల, పాల్తితండా,తంగేళ్ల తండా, తుమ్మచెట్టు,చలకుర్తి, కుంకుడుచెట్టుతండా,జానారెడ్డి కాలనీ ప్రజలు కోరుతున్నారు.

ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి బస్సులను ప్రవేశపెట్టి రవాణా సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

దీపావళి సినిమాల్లో క కంటే పెద్ద హిట్ ఆ సినిమానే.. అసలేం జరిగిందంటే?