అల్లు అర్జున్ తో తనని తాను పోల్చుకున్న పల్లవి ప్రశాంత్… కాస్త ఓవర్ అయిందంటూ?
TeluguStop.com
రైతు బిడ్డ అనే ట్యాగ్ తగిలించుకుని బిగ్ బాస్ 7( Bigg Boss 7 ) కార్యక్రమంలో ఛాన్స్ కొట్టేసి సింపతి డైలాగులతో విన్నర్ గా బయటకు వచ్చారు కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) .
ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం వ్యవసాయ పనులను పక్కనపెట్టి సెలబ్రెటీ రేంజ్ లో తన లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ కార్యక్రమంలో తాను కనుక గెలిస్తే ఆ డబ్బును రైతులకే పంచుతానని చెప్పారు కానీ ఇప్పటివరకు రైతులకు ఇవ్వకపోవడంతో ఈయనపై భారీ స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి.
"""/" /
ఇలా బిగ్ బాస్ కార్యక్రమం పూర్తి అయిన వెంటనే బయట ప్రశాంత్ అభిమానులు చేసిన అల్లరి కారణంగా పోలీసులు ఈయనని అరెస్టు( Arrest ) చేసి చంచల్ గూడ జైలుకు పంపిన సంగతి తెలిసిందే.
ఇలా కొద్దిరోజుల పాటు జైలులో ఉన్న ప్రశాంత్ అనంతరం బెయిలు మీద బయటకు వచ్చారు.
అయితే తాజాగా పల్లవి ప్రశాంత్ మరోసారి తన జైలు జీవితాన్ని గుర్తు చేసుకున్నారు.
ఇటీవల సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అల్లు అర్జున్( Allu Arjun ) అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయినటువంటి కొన్ని ఫోటోలను అలాగే పల్లవి ప్రశాంత్ అరెస్టు అయినటువంటి కొన్ని సన్నివేశాలను ఒక వీడియో చిత్రీకరించి ఈయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
"""/" /
ఇక ఈ పోస్ట్ చేసిన పల్లవి ప్రశాంత్ దీనికి ఏకంగా ఇండియన్ హీరోస్ అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు.
పల్లవి ప్రశాంత్ షేర్ చేసిన పోస్ట్ కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారింది.
దీనిని చూసిన నెటిజన్లు మండి పడుతున్నారు.ముఖ్యంగా బన్నీ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.
అల్లు అర్జున్ కు నీకు పోలిక ఏంటి అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు ఇది కాస్త ఓవర్ అయింది బ్రో అంటూ కామెంట్ లు చేస్తున్నారు.
యూకే: ఈ గుడ్డు చాలా స్పెషల్.. అందుకే ఈ ధరకు అమ్ముడుపోయింది..?