Pallavi Prashanth : జైలు కూడు బాగుంది…నన్ను చూసిన ఖైదీలు అలా మాట్లాడేవారు: పల్లవి ప్రశాంత్

కామన్ మాన్ గా బిగ్ బాస్( Bigg Boss ) హౌస్ లోకి అడుగుపెట్టి బిగ్ బాస్ విన్నర్ గా నిలిచి సెలబ్రిటీగా మారినటువంటి పల్లవి ప్రశాంత్ ( Pallavi Prashanth ) గురించి అందరికీ తెలిసిందే.

రైతు బిడ్డగా వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.

ఇక ఈ కార్యక్రమంలో అద్భుతమైనటువంటి ఆట తీరును కనబరుస్తూ ఏకంగా ఈయన విన్నర్ గా బయటకు వచ్చారు.

అయితే ఈయన గెలిచారన్న ఆనందం ఎక్కువసేపు నిలవలేకపోయింది.గ్రాండ్ ఫినాలే( Bigg Boss Grand Finale ) రోజు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళుతూ ఈయన అభిమానులు ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు.

"""/"/ ఇలా ధ్వంసం చేయడంతో పోలీసులు ఈయనపై కేసు నమోదు చేసి ఏకంగా రెండు రోజులపాటు జైలుకు తరలించిన సంగతి మనకు తెలిసిందే.

అయితే మొదటిసారి ప్రశాంత్ తన రెండు రోజుల జైలు( Jail ) జీవితం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆ రెండు రోజులు నాకు చాలా కష్టంగా గడిచింది.అన్నం కూడా తినాలనిపించలేదు కానీ తోటి ఖైదీలందరూ బ్రతిమలాడితే భోజనం చేశానని జైలు కూడు బాగుందని ఈయన తెలిపారు.

అక్కడ నన్ను వీఐపీలా ట్రీట్ చేసిన చేయకపోయినా భోజనం బాగుందని తెలిపారు. """/"/ ఇక అక్కడ ఖైదీలు నాతో అన్నా అన్నా అంటూ మాట్లాడేవారు మరి కొంతమంది బిగ్ బాస్ గురించి అడుగుతూ విన్నర్  ఎవరిని ప్రశ్నించేవారు.

ఇక నేను లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి ఖైదీలు( Prisoners ) బయట జరిగిన గొడవ గురించి ఖైదీలకు చెప్పేవారు.

నేనేం తప్పు చేయకపోయినా జైలుకు వెళ్లాల్సి వచ్చింది అందుకే నేనేం భయపడలేదని, నన్ను విమర్శించిన వారికి కూడా అదే గతే పట్టవచ్చని ఈయన తెలిపారు.

ఇక నేను జైలుకు వెళ్లి చాలా విషయాలు నేర్చుకున్నానని వెల్లడించారు.జీవితంలో రెండు చోట్లకి అసలు వెళ్ళకూడదు అది ఒకటి హాస్పిటల్, రెండు జైలుకు అంటూ తన రెండు రోజుల జైలు జీవితం( Jail Life ) గురించి ప్రశాంత్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ది రాజాసాబ్ మూవీలో నిధి అగర్వాల్ దెయ్యం రోల్ లో కనిపిస్తారా.. అసలు నిజాలివే!