ఆ సర్వేలో ఆది,సుధీర్ తో పోటీ పడుతున్న పల్లవి ప్రశాంత్ గ్రేట్ అంటూ?

సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది మంచి గుర్తింపు సంపాదించుకున్నారనే విషయం మనకు తెలిసిందే.

ఇలా సోషల్ మీడియాలో చేసే యూట్యూబ్ వీడియోలు, రీల్స్ ద్వారా సినీ సెలెబ్రిటీలుగా కొందరు ఇండస్ట్రీలో స్థిరపడ్డారు.

ఇలా సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీ హోదా అందుకున్నటువంటి వారిలో పల్లవి ప్రశాంత్ ( Pallavi Prashanth ) కూడా ఒకరు.

ఈయన ఒక రైతుబిడ్డగా రైతులు పడే కష్టాలు అన్నింటిని కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోల రూపంలో అందరికీ తెలియజేసేవారు.

ఇలా ఎంతో ఫేమస్ అయినటువంటి ప్రశాంత్ తాను బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమంలోకి ఒక్కసారైనా వెళ్లాలి అంటే ఈ వీడియోల ద్వారా తెలిపారు.

"""/" / ఇలా యూట్యూబ్ వీడియోల ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ఏకంగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం అందుకున్నారు.

ఒక మారుమూల ప్రాంతంలో రైతుబిడ్డగా పొలం పనులు చేసుకుంటూ ఉన్నటువంటి ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలోకి అడుగుపెట్టి సినీ సెలబ్రిటీలకు సైతం పోటీగా నిలిచి దూసుకుపోతున్నారు.

పల్లవి ప్రశాంత్ ని కనుక చూస్తే టాప్ 5లో ఖచ్చితంగా ఉంటారన్న ధీమా అందరిలోనూ ఉంది.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా బయట కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

"""/" / ఇక పల్లవి ప్రశాంత్ కు బయట ఏ స్థాయిలో క్రేజ్ ఉంది అనే విషయాన్ని తాజాగా ఓ సర్వే ద్వారా బయటపెట్టారు.

ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్( Ormax ) సర్వే ప్రకారం టాప్ బుల్లితెర స్టార్స్ తో పల్లవి ప్రశాంత్ పోటీపడుతున్నారు.

అక్టోబర్ 23 వరకు అత్యంత పాప్యులర్ మేల్ బుల్లితెర స్టార్స్ నాన్ ఫిక్షన్ విభాగానికి సంబంధించినటువంటి ఫలితాలను విడుదల చేయగా ఇందులో పల్లవి ప్రశాంత్ ఏకంగా హైపర్ ఆది( Hyper Aadi ) సుడిగాలి సుదీర్( Sudigali Sudheer )వంటి వారితో పోటీగా ఉన్నారు.

ఇక టాప్ ఫైవ్ లో భాగంగా ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ( Sekhar Master ) ఐదో స్థానంలో ఉండగా పల్లవి ప్రశాంత్ నాలుగో స్థానంలో ఉండటం విశేషం.

మొదటి మూడు స్థానాలలో హైపర్ ఆది సుడిగాలి సుదీర్, జబర్దస్త్ కమెడియన్ సునామి సుధాకర్( Sunami Sudhakar )వరుస 3 స్థానాలలో ఉండగా నాలుగో స్థానంలో పల్లవి ప్రశాంత్ ఉండటంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

గేమ్ చేంజర్ కలెక్షన్స్ చూస్తే మతి పోతుంది…