Pallavi Prashanth : శివన్న ఎప్పుడూ నా గుండెల్లో ఉంటాడు.. శివాజీపై పల్లవి ప్రశాంత్ క్రేజీ కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్ సీజన్‌ 7( Bigg Boss Season 7 ) లో కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన రైతుబిడ్డ ప్రశాంత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

అప్పటినుంచి పల్లవి ప్రశాంత్ పేరు తరచూ ఏదోక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది.

ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ గెలిచిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బయట జరిగిన గందరగోళం అంతా ఇంతా కాదు.

దాంతో పోలీసులు కేసు నమోదు చేసి ‌పల్లవి ప్రశాంత్ ని A1గా, అతని డ్రైవర్ రాజుని A2 గా పరిగణించి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం వారిని చంఛల్ గూడ జైలుకి రిమాండ్ కి పంపించింది.

ఇక రెండు రోజుల తర్వాత అతనిని బెయిల్ మీద విడిపించాడు భోలే షావలి.

"""/" / రైతుబిడ్డకి పాటబిడ్డ భోలే షావలి తోడుగా నిలిచాడు.సుమారుగా యాభై మంది లాయర్లతో భోలే షావలి మాట్లాడి ప్రశాంత్ కి బెయిల్ వచ్చేలా చేశాడు‌.

ఇక ప్రశాంత్ బయటకొచ్చాక శివాజీ, యావర్, భోలే షావలి( Bhole Shavali ), నయని పావని,‌ టేస్టీ తేజ, శుభశ్రీ కలిసారు.

వీరితో పాటు శివాజీ కొడుకు రిక్కీ కూడా ఉన్నాడు.ఇక అందరు కలిసి భోలే షావలి ఇంట్లో భోజనం చేశారు.

జైలులో ప్రశాంత్ ఉన్నప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో వారి పేరెంట్స్ తో శివాజీ మాట్లాడుతూ ధైర్యం చెప్పి అండగా నిలిచాడు.

ఇక శివాజీ, నయని పావని, భోలే, యావర్, టేస్టీ తేజ అందరు కలిసి సరదాగా ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నారు.

హౌస్ లో ఉన్నన్ని రోజులు స్పై బ్యాచ్ గా ఉన్న శివాజీ, ప్రశాంత్, యావర్ బయటకొచ్చాక ఒకే స్క్రీన్ మీద కనిపించేసరికి వీరి అభిమానులకు ఒకరకంగా పండుగలా అనిపించింది.

"""/" / అందుకే ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కడ చూసిన వీరి ముగ్గురు కలసి ఉన్న వీడియోలే కనిపిస్తున్నాయి.

ఏం తప్పు చేయని వాడు దేనికి భయపడడు.వాడు చట్టాన్ని గౌరవించాడు.

వాడు నేరస్తుడు కాదు భాదితుడు.ఎవరో చేసిన పనికి వాడు కారణమయ్యాడు వాడేం తప్పు చేయలేదు అంటు శివాజీ మాట్లాడిన మాటలన్నీ పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) అభిమానులకి జరిగిన గాయానికి మందుల్లా పనిచేశాయి.

ఇక బయటకు రాగానే శివాజీని ( Sivaji )కలిసాడు ప్రశాంత్.‌ శివాజీ తన ఇంస్టాగ్రామ్ లో ప్రశాంత్‌తో కలిసి లైవ్‌లో మాట్లాడాడు.

బిడ్డా.ఏరా వారికి చెప్పరా వారు శివన్న ఎక్కడ ఎక్కడా అని ఒక అరుపులు అంటూ ప్రశాంత్‌తో అన్నాడు.

ఆ మాటలకు ప్రశాంత్ స్పందిస్తూ.శివన్న ఎప్పుడూ నా గుండెల్లో ఉంటాడు.

మీ అందరి ప్రేమను గెలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.నాకు అన్న లేడు అని ఉండే కానీ నేను చచ్చిపోయేంతవరకూ అన్ననే నాకు అన్నా థాంక్యూ సో మచ్ అన్నా అని ప్రశాంత్ అన్నాడు.

బాలయ్య బాబు ప్రయోగత్మాకమైన సినిమాలు చేయలేడా..?