రైతులను మోసం చేసి లక్షల్లో సంపాదిస్తున్న బిగ్ బాస్ విన్నర్.. బయటపడిన అసలు నిజం?

బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమం ద్వారా సెలబ్రిటీ హోదా అందుకున్నారు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ).

ఒక సాధారణ రైతు బిడ్డగా వ్యవసాయ పనులు చూసుకుంటూ ఉన్నటువంటి ఈయన యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యారు.

ఇలా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా బిగ్ బాస్ అవకాశాన్ని కూడా సొంతం చేసుకున్నారు.

బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి ప్రశాంత్ చివరికి విన్నర్ గా నిలిచి బయటకు వచ్చారు.

"""/" / ఇలా బిగ్ బాస్ విన్నర్( Bigg Boss Winner ) అయినటువంటి ఈయనకు భారీ స్థాయిలో బహుమతులు లభించాయి.

15 లక్షల విలువ చేసే కారు బంగారు ఆభరణాలతో పాటు సుమారు 30 లక్షలకు పైగా నగదు కూడా వచ్చింది అయితే ఆ నగదు మొత్తాన్ని కూడా రైతులకు( Farmers ) పంచుతానని హామీ ఇచ్చినటువంటి పల్లవి ప్రశాంత్ ఇప్పటివరకు ఇచ్చిన మాటపై నిలబడలేదు.

కేవలం ఒక రైతు కుటుంబానికి మాత్రమే లక్ష రూపాయలు సహాయం చేసినటువంటి ఈయన ఇప్పటివరకు మరొక రైతు కుటుంబానికి సహాయం అందించకపోవడంతో భారీ స్థాయిలో ఈయనపై విమర్శలు చేస్తున్నారు.

"""/" / ఇలా ఇచ్చిన మాట తప్పారని ఎంతోమంది ఈయనపై ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.

కానీ ప్రశాంత్ మాత్రం తాను రైతులకు చేస్తానన్న సహాయం గురించి ఆలోచించకుండా సిటీలోనే ఉంటూ తన గురువు శివాజీతో( Sivaji ) ఎంజాయ్ చేస్తూ కనిపించారు.

అంతేకాకుండా రైతులు ఎవరూ కూడా సహాయం కోసం తన ఇంటి వద్దకు వచ్చు తన తల్లి తండ్రులను ఇబ్బంది పెట్టద్దని తెలిపారు.

ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు వెళుతూ లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నారని తెలుస్తోంది.

ఒక్కో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఏకంగా రెండు నుంచి మూడు లక్షల రూపాయల వరకు డబ్బు తీసుకుంటున్నట్టు సమాచారం.

మీరు సమోసా ప్రియులా.. అయితే ఇకపై తినే ముందు ఇవి తెలుసుకోండి..!